బావ.. బావ మరిది.. ఓ ఆధిపత్య రాజకీయం!

Publish Date:May 11, 2023

Advertisement

బావ.. ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదన్నట్లు.... బాలినేని తనకు బావే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కాదన్నట్లుగా ఆయన బావమరిది, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారశైలి ఉందనే ఓ చర్చ ఒంగోలు నగరంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ఉండగా.. ప్రకాశం జిల్లాలో బాలినేని మాటారాజకీయమే.. బాటా రాజకీయమే.. . చివరకి ఆయన బర్త్ డే ఫంక్షన్ కూడా రాజకీయమే అన్నట్లుగా నడిచింది. ఇంకా చెప్పాలంటే...  బాలినేని వాసన్న రాజకీయం అంతా స్మూత్‌గా.. సాఫ్ట్‌గా మూడో కంటికి తెలియకుండా నరుక్కోంటు వెళ్లిపోయేవారని.. అయితే బాలినేనికి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. అప్పటి వరకు కొంగుచాటు కృష్ణుడిలాగా తెరచాటు రాజకీయం చేసిన ఆయన బావమరిది వైవీ సుబ్బారెడ్డి తెరమీదకు ఎంటర్‌ ది డ్రాగన్‌లాగా ఎంటరై... టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా దేవదేవుడి సన్నిధిలోనే సేవ చేసుకొంటూ కూడా... చిత్తం, చూపులు అన్నీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల  చుట్టూనే గిరా గిర్రా తిరుగుతోన్నాయని... ఆ క్రమంలో ఉన్నతాధికారుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఆయనగారి కనుసన్నల్లోనే జరుగుతోండడంతో.. బావగారి సున్నిత మనస్సు.. గట్టిగానే కందిపోయిందని... ఈ నేపథ్యంలో మూడు జల్లాల పార్టీ సమన్వయకర్త పోస్టింగ్‌కి బావగారు బాలినేని మంగళం పాడేశారని... దాంతో ఆ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ వద్దకు చేరడం.. బాలినేనిని పిలిపించుకొని.. రాజీనామాకి దారి తీసిన పరిస్థితులు... ఆ క్రమంలో బావమరిదిగారు చేస్తున్న రాజకీయ చెదరంగంలో తనను ఓ చెద పురుగుని చేసేశారంటూ సాక్షాత్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే బాలినేని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు ఓ చర్చ సైతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతోంది. 

అయితే సీఎం జగన్‌తో జరిగిన భేటీలో మళ్లీ మూడు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించాలంటూ పార్టీ అధినేత కోరినా బాలినేని సున్నితంగా తిరస్కరించినట్లుగా ఓ టాక్ వైరల్ అవుతోంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బామ్మర్థి వై వీ సుబ్బారెడ్డి రాజకీయానికి కత్తెర వేయాలని పార్టీ అధినేతను కోరినా అందుకు ముఖ్యమంత్రి  జగన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. దీంతో చేసిది లేక.. బాలినేని సైలెంట్‌గా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.  

మరోవైపు వైవీ సుబ్బారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. అవి విఫలమవుతూనే వస్తున్నాయనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో కొన.. సాగుతోంది. ఆయన ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉండి కూడా పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని... అలాగే టీటీడీ చైర్మన్‌గా ఆయన హాయాంలో తిరుమలలో వరుసగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ఓ చర్చ ఒంగోలులోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గట్టిగానే సాగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బావమరిది అంటే... బావా బతుకు కోరతాడంటారు... అంతే కానీ ఈ బామ్మర్ధి ఏంటీ.. బావగారి రాజకీయ భవిష్యత్తుకి గంట కొట్టి మంగళహరతులు ఇచ్చేసేలా వ్యవహరిస్తున్నారనే  చర్చ ఒంగోలు నగరంలో కొన.. సాగుతోంది.  ఏదీ ఏమైనా తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్నట్లుగా బామ్మర్థిగారి వ్యవహారం ఉందని అభిప్రాయం సైతం సదరు నగర ప్రజల్లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.