Publish Date:Aug 15, 2022
దేశాన్ని అవినీతి, వారసత్వం చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయడం ప్రధానిగా మోడీకి ఇది తొమ్మదో సారి.
Publish Date:Aug 15, 2022
రెండు స్థంభాలకు తాడు గట్టి ఓ పిల్ల కర్ర ఆదారంతో ఆ తాడు మీద నడు స్తూ ఒక వేపు నుంచి మరో వేపు నడుస్తుంది, గొప్ప ఫీట్. గాల్లో పుల్లప్స్ చేసే వాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!
Publish Date:Aug 15, 2022
విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మా ణానికి కృషి చేశామని, మనం చేసిన కృషి కారణంగా ఐటి రంగం అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు అదే వెన్నెముకగా మారిందన్నారు.
Publish Date:Aug 15, 2022
కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర అసమర్ధ నిర్వాకం వల్లనే దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడిందని కేసీఆర్ విమర్శించారు
Publish Date:Aug 15, 2022
పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లా ల పెంపు అని తెలి పారు. రైతులకు అండగా వైఎస్సార్ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నా మని జగన్ వెల్లడించారు.
Publish Date:Aug 15, 2022
స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతంత్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు
Publish Date:Aug 15, 2022
తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తుల రద్దీని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో తిరుమల కొండపై భక్తులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతున్నప్పటికీ భక్తులు మాత్రం ఇంకా ఎక్కువ సమయమే పడుతోందని చెబుతున్నారు.
Publish Date:Aug 14, 2022
భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వినూత్న రీతితో ఓ వ్యోమగామి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Publish Date:Aug 14, 2022
ఈజిప్టులోని ఓ చర్చిలో ఆదివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. చర్చిలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ కనీసం ఐదు వేల మంది ఉన్నారని చెబుతున్నారు.
Publish Date:Aug 14, 2022
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండమంటూ కితాబిచ్చారు. లాహో్ లో ఆదివారం (ఆగస్టు 14)లాహోర్‌లో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన సభలో ఇమ్రాన్‌ఖాన్ అమెరికా ఒత్తిళ్లను లెక్క చేయకుండా, భారత్ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్ సమర్థించారు. ఇండియా, పాకిస్థాన్‌లకు ఒకే రోజు స్వాతంత్య్రం లభించినా, న్యూఢిల్లి మాత్రం దేశ ప్రజల అవసరాలకు తగినట్లు విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, కానీ, పాకిస్థాన్‌లోని షెహ్బాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ఖాన్ విమర్శలు గుప్పించారు.
Publish Date:Aug 14, 2022
ఉన్న అవకాశాలను కూడా చేజార్చుకోవడం కాంగ్రెస్ కు అలవాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ కు నిజంగా మునుగోడు ఉన ఎన్నిక కలిసి వచ్చిన అవకాశమనే చెప్పాలి. అయితే అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా అంటే ఔననే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం.
Publish Date:Aug 14, 2022
తెలుగు రాష్ట్రాలలో వరద ముప్పు తొలగడం లేదు. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో సర్వం కోల్పోయిన బాధితులు మరోసారి గోదావరి వరద ముంచుకు వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కేవలం 20 రోజుల కిందట వరద ఉధృతికి కకావికలమైన పోవవరం ముంపు గ్రామాల ప్రజలు మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకున్నారు.
Publish Date:Aug 14, 2022
మహా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫోన్ లో హలో అని కాదు.. వందే మాతరం అనాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వాధికారులందరూ సోమవారం (ఆగస్టు 15) నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకూ తమకు ఫోన్ వస్తే హలో అంటూ ఆన్సర్ చేయకూడదనీ, వందే మాతరం అంటూ ఆన్సర్ చేయాలని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు.