వెస్ట్ బెంగాల్ ఎన్నికలు.. ముస్లిం వీటో అసలు ఉందా?

Publish Date:Apr 18, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎక్కువ విశ్లేషణలు ఒకే వాక్యంతో మొదలవుతాయి.. అదేమిటంటే, ముస్లిం ఓటు కన్‌సాలిడేషన్‌.  అంటే, మైనారిటీ ఓటు 294 సీట్లలో 80–120 సీట్ల భవిష్యత్తు నిర్ణయిస్తుందనే వాదన. అయితే..   జనాభా గణాంకాలు, జిల్లా వారీ మ్యాప్ లు, గత ఎన్నికల మార్జిన్లు చూసినప్పుడు, ఈ కథనం   అతిశయోక్తిగా కనిపిస్తుంది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా  27 అయినప్పటికీ..  3 జిల్లాల్లోనే వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.  

 2011 జనగణన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా 27శాతం.  రాష్ట్రంలోని మొత్తం జిల్లాల్లో వారి జనాభా మెజారిటీగా ఉన్నది మూడు జిల్లాల్లోనే. అవి ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్ పూర్. వీటిలో ముర్షిదాబాద్ లో ముస్లింల జనాభా 66శాతంగా ఉంది. ఇక మాల్డా జిల్లాలో 51శాతం, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో 50శాతంగా ఉంది.  

మిగతా 20 జిల్లాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ,   251 అసెంబ్లీ  సీట్లలో.. స్పష్టంగా హిందువుల మెజారిటీ ఉంది.  అంటే, రాష్ట్ర స్థాయిలో ముస్లింల జనాభా 27శాతం ఉన్నప్పటికీ..  భౌగోళికంగా అది కొన్ని బెల్ట్‌లలో కేంద్రీకృతమై ఉంది, మిగతా చోట్ల విస్తరించి, లేదా చీలిపోయిన రూపంలో ఉంది.

 80 సీట్లు ముస్లిం నిర్ణయిస్తారు అన్న గణితం ఎక్కడ తప్పిందంటే.. ఏ జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం దాటితే..  ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను ముస్లిం ప్రభావిత సీట్లు గా లెక్కించడం. అలా లెక్కించడం వల్లే. ఇలా లెక్కిస్తే.. రాష్టరంలో 80కి పైగా సీట్లలో జయాపజయాలను ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు.ఇదే.. ముస్లిం వీటో కథనానికి బేస్.

అయితే సమస్య ఎక్కడంటే.. అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్–పాస్ట్–ది–పోస్ట్ (ఎఫ్పిటీపీ) వ్యవస్థలో జరుగుతాయి. అంటే జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం  ఉన్న.. ప్రతి నియోజకవర్గంలోనూ  అదే స్థాయి కన్‌సాలిడేషన్ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా  స్వతంత్రంగా నిర్ణయించే  స్థాయి ప్రభావం రావాలంటే.. ఒక సీటులో ముస్లిం ఓటు శాతం సాధారణంగా 38 నుంచి 40 శాతం ఉండాలి. అప్పుడు మాత్రమే  ఒకే బ్లాక్‌గా ఓటేస్తే, ఫలితాన్ని తిప్పే శక్తి వస్తుంది.  అంటే, జిల్లా స్థాయి శాతాన్ని నేరుగా సీటు స్థాయి ప్రభావంగా గణించడం సరికాదు. .

జిల్లాల వారీగా  ముస్లిం డిసెసివ్ సీట్లు ఏంటని చూస్తే..  ముర్షిదాబాద్ జిల్లాలో 22 స్థానాలు. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 66శాతం.  ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉన్న సీట్లు 20.  అలాగే మాల్డా జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ ముస్లిం జనాభా 51శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 12. ముస్లిం ఓటు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు 8. ఇక నార్త్ దినాజ్ పూర్ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 50శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 9. వీటిలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు ఐదు. 
అలాగే బీర్భూమ్. దక్షిణ 24 పరగణాలు, నదియా. ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో ముస్లిం కన్సాలిడేషన్ 38 నుంచి 40 శాతం వరకూ ఉంటుంది.  

 అవేంటని చూస్తే.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 33 సీట్లలో 5 నుంచి ఏడు స్థానాలలో, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని 31 స్థానాలలో 4 నుంచి 6 సీట్లలో ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉంటుంది. మొత్తంగా ఈ జిల్లాలన్నీ కలిపి చూసినా  ముస్లిం ఓటు నిర్మాణాత్మకంగా ఉండే సీట్లు 47 నుంచి 54కు మించవు.  అంటే రాష్ట్రంలోని మొదత్తం 294 నియోజకవర్గాలలో కేవలం 16 నుంచి 18 శాతం సీట్లలో మాత్రమే ముస్లిం వీటో కాదుకాదు హెడ్ స్టార్ట్ ఉంటుందన్న మాట.  

ఇక్కడ ఒక   తేడా ఉంది.. అదేంటంటే.. ఒక పార్టీకి ఒక కమ్యూనిటీ నుంచి భారీ కన్‌సాలిడేషన్ వస్తే, ఆ పార్టీకి ఆ సీట్లలో స్పష్టమైన  ఆధిక్యం ఉంటుంది. అదే ఏ సీటులోనైనా ఏ కాంబినేషన్ వచ్చినా ఒక కమ్యూనిటీ అంగీకరించని పరిస్థితి ఉంటే ఎవరూ గెలవలేని స్థాయి ప్రభావం.. ఇదే వీటో.  బెంగాల్ లో ముస్లిం ఓటు కొన్ని బెల్ట్‌లలో హెడ్ స్టార్ట్ ఇస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వీటో శక్తి ఇవ్వదు.  ఇకపోతే వేస్టెడ్ ఓటు సమస్య ఒకటి ఉంది. దీని వల్ల భారీ మెజారిటీలు వస్తాయి కానీ రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు భగబంగోలా సీటులో తృణమూల్ కాంగ్రెస్ కు లక్షా ఆరు వేల మెజారిటీ వచ్చింది. అలాగే సుజాపూర్ లో లక్షా ముఫ్పై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. 

ఎఫ్పిటీపీ వ్యవస్థలో.. గెలవడానికి అవసరమైనది ఒక ఓటు ఎక్కువ మాత్రమే.     దాని మించి వచ్చిన ఓట్లన్నీ  సర్‌ప్లస్ మాత్రమే. అవేమీ ప్రాతినిథ్యాన్ని,  ప్రతినిధిత్వాన్ని పెంచవు. అంటే, ముస్లిం ఓటు భారీగా కన్‌సాలిడేట్ అయిన సీట్లలో.. TMC వంటి పార్టీలు అత్యధిక మెజారిటీలతో గెలుస్తాయి. అంతే.. కానీ ఆ అదనపు లక్షల ఓట్లు ఇతర సీట్లలోకి బదిలీ అవ్వవు.  రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు, ఇది ఒక స్ట్రక్చరల్ వేస్ట్ అంతే. 

ఇదే సమయంలో  TMCకి అత్యంత కీలకమైన 13 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ మూడు వేల ఓట్ల కంటే తక్కువే.  ఇవేవీ ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు కావు.  అంటే..   ఎలక్షన్‌ను తిప్పిన సీట్లు ముస్లిం బెల్ట్‌లో కాకుండా, మిక్స్‌డ్ లేదా హిందూడామినేటెడ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.  
2021లో నిజంగా ఎక్కడ ఎన్నిక తేలింది? అంటే..  హౌరా, హూగ్లీ, మటువా బెల్ట్ లో ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ.  కానీ ఇక్కడే రేజర్ థిన్ మార్చిన్లు వచ్చాయి.  మొత్తం 7 జిల్లాల్లో టీఎమ్సీ 50,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది, మిగతా అన్ని సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. అంటే.. ఎలక్షన్  లెక్క మేరకు ముస్లిం బెల్ట్‌లో భారీ మెజారిటీలు సురక్షిత సీట్లు. కానీ  వేస్ట్‌డ్ ఓట్లు. మిక్స్‌డ్ అండ్ హిందూ డామినెంట్ బెల్ట్‌లో చిన్న మార్జిన్లు. ఇవే అసలైన డిసెసివ్ బ్యాటిల్‌గ్రౌండ్స్. 

91 లక్షల డిలీషన్, సీటుకు 31,000 ఓట్లు: 2026లో కొత్త ఫ్యాక్టర్

ఇక మరో  కీలక అంశం ఏమిటంటే..  ఓట్ల తొలగింపు. వెస్ట్ బెంగాల్ లో మొత్తం  91 లక్షల ఓటు తొలగించారు.  అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు.  ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్.  మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో  టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?  ఏ సామాజిక సమూహం, ఏ పార్టీ సపోర్ట్ బేస్ ఎక్కువగా ప్రభావితమైంది? అన్నదే ఇప్పుడు 2026 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.  

 ముస్లిం కన్‌సాలిడేషన్ కంటే, ఓటర్ లిస్ట్‌లోని మార్పులు, మిక్స్‌డ్ బెల్ట్‌లలోని చిన్న మార్జిన్‌లు 2026లో ఎక్కువగా డిసెసివ్ అయ్యే అవకాశం ఉంది. ముస్లిం ఓటు వంద శాతం  దగ్గరగా కన్‌సాలిడేట్ అయితే.. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ఒక పార్టీకి 50 నుంచి 60 సీట్లు  సేఫ్  అవుతాయి. అదే సమయంలో మిగతా 234 సీట్లలో.. హిందూ ఓటు కూడా అదే స్థాయిలో కన్‌సాలిడేట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అప్పుడు మొత్తం రాష్ట్ర ఎన్నికల లెక్క పూర్తిగా మారిపోతుంది. అంటే..  పోలరైజేషన్ ఒకే సమాజానికి  వీటో  ఇవ్వదు. అది రెండువైపులా పదునున్న కత్తిలా  పనిచేస్తుంది.ఇది కచ్చితంగా  ప్రతి ప్రధాన ఆటగాడికి లాభం చేకూరుస్తుంది.  

టీఎంసీ ముస్లిం ఓటు మా వెంట ఉంది. మేం సెక్యులరిజం కాపలాదారు అని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.కరెప్షన్, గవర్నెన్స్, స్థానిక అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కమ్యూనల్ థ్రెట్ లో కవర్ చేసుకోవచ్చు.  ఇక బీజేపీ అయితే.. ముస్లిం బ్లాక్ ఓటు అంటూ హిందూ ఓటును మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది వీటో భయం, అపరాధ భావనను కలగలిపి పోలరైజేషన్ ను మరింత పెంచుతుంది.  ఇక ఐఎస్ఎఫ్ వంటివి ముస్లిం ఓటు మాచేతిలో ఉందంటూ పొలిటికల్ టెజిటమసీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి.  అంటే, డేటా చెప్పేది ఒకటి, రాజకీయ కథనం చెప్పేది మరోటి అన్న మాట.  అంతిమంగా తేలేదేంటంటే.. పశ్చిమ బెంగాల్ లో హెడ్ స్టార్ట్ ఉంది, వీటో లేదు.  డేటా, మ్యాప్, జిల్లాల వారీ శాతం, సీటు వారీ మార్జిన్ అన్నీ కలిపి చూసినా అదే తేలుతుంది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ముస్లిం ఓటు ఒక పార్టీకి స్పష్టమైన హెడ్ స్టార్ట్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 294 సీట్లలో, ముస్లిం ఓటు 80–120 సీట్లను  స్వతంత్రంగా  నిర్ణయించే స్థాయి  శక్తి కలిగి లేదు. వాస్తవ ఎన్నికల ఫలితాలు తేలేది.. మిక్స్‌డ్ బెల్ట్‌లలో, అలాగే.. చిన్న మార్జిన్ సీట్లలో. ఓటర్ లిస్ట్ మార్పులు, టర్నౌట్, లోకల్ ఇష్యూల కలయికలో. 


పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలో   జిల్లాల వారీ డెమోగ్రఫీ, సీటు వారీ మార్జిన్, ఓటర్ లిస్ట్ మార్పులు, పోలరైజేషన్ రెండు వైపులా ఎలా పనిచేస్తుందో చూడాలి. అప్పుడు మాత్రమే, ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్న కంటే, ఎలా గెలుస్తారు?   అనే లోతైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. 

సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని 

By
en-us Political News

  
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.