రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా?  అసలు  నిజం ఏంటంటే!

Publish Date:Jun 18, 2026

Advertisement

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా?  ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే..

బరువు పెరగడానికి అసలు కారణం..

డాక్టర్ల ప్రకారం..  బరువు పెరగడం లేదా తగ్గడం అనేది  తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా  రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.  అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు.

అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే..

అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి శక్తిని అందిస్తాయి.  రాత్రి భోజనం చేసేటప్పుడు,  శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల,  ఎక్కువగా అన్నం తిని,  రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు.

బియ్యం రకం ముఖ్యం..

అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.

 అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.

జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం..

ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి  జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి.

సమతుల్యం ఉంటేనే..

రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,  రోజువారీ కేలరీలను  గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల  బరువు పెరగడం అనేది జరగదు.

 బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా  తినే ఆహారం పరిమాణం, ఆహార రకం ,  మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.