పిచ్చోడి చేతిలో బలైన సైకాలజిస్ట్
Publish Date:Aug 6, 2025
Advertisement
ఆమె ఒక మంచి డాక్టర్.. తన వద్దకు వచ్చిన మానసిక రోగికి వైద్యం చేసి నయం చేయడమే కాకుండా అతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ చివరకు అతని వేధింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకుంది... ఈ విషాద ఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకుంది. సనత్ నగర్ లో నివాసముంటున్న సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహ గౌడ్ కుమార్తె రజిత (33) సైకాలజిస్ట్ గా ఇంటర్నషిప్ లో భాగంగా జూబ్లీ హిల్స్ లోని ఓ మానసిక చికిత్సాలయంలో పనిచేస్తున్న సమయంలో అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న.. కెపిహెచ్ బి కి చెందిన ఆగు రోహిత్ (33) అనే వ్యక్తితో డాక్టర్ రజితకు పరిచయం ఏర్పడింది. అయితే డాక్టర్ రజిత మానసిక రోగి అయిన రోహిత్ కు వైద్యం చేసింది. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని డాక్టర్ రజితకు చెప్పాడు. అంతే కాకుండా ప్రేమిస్తున్నానంటూ డాక్టర్ రజిత వెంట పడ్డాడు.. రోహిత్ కు పూర్తియా నయం అయ్యిందని భావించిన రజిత అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. తల్లిదండ్రుల అనుమతిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. రజిత ఎంతో సంతోషంతో రోహిత్ జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే ఆమెకు విషాదమే ఎదురయ్యింది. వి వాహం అయిన తర్వాత రోహిత్ పని చేయ కుండా జల్సాలకు అలవాటు పడ్డాడు. రజిత మాత్రం నగరంలోని ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. రజిత జీతం డబ్బులు కూడా తీసుకొని రోహిత్ ఎంజాయ్ చేసేవాడు. చెడు అలవాట్లు మాను కోవాలని రజిత ఎన్ని మార్లు చెప్పినా కూడా అతనిలో మార్పు రాలేదు. పైగా వేధింపులు మొదలు పెట్టాడు. తానే కాకుండా తన తల్లి సరేష, తండ్రి కిష్టయ్య, సోదరుడు మోహిత్ తో కలిసి భార్య రజిత ను వేధించేవాడు. రజిత జీతం డబ్బులు ఇవ్వక పోతే ఇష్టం వచ్చి నట్లు ఆమెను కొట్టేవాడు. రోజు రోజుకి భర్త రోహిత్ వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక రజిత గత నెల 16వ తేదీన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కానీ సమయానికి తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో ప్రాణా లతో బయటపడింది. ఆ తర్వాత గత నెల జూలై 28న బాత్రూం కిటికీ లోనుంచి కిందకు దూకి మరోసారి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు వెంటనే అమీర్ పేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు... రజిత బుధవారం (ఆగస్టు 6) మరణించారు. రజిత తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/doctor-commits-sucide-39-203619.html





