బీజేపీలో వైసీపీ వర్గం టీడీపీతో పొత్తును వద్దంటున్నారా?

Publish Date:Mar 25, 2022

Advertisement

నిజమే. జాతీయ స్థాయిలో బీజేపీ అతి పెద్ద పార్టీ. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న,అత్యంత శక్తివంతమైన పార్టీ తమదే అని కూడా ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పుకుంటారు.కాలర్లు ఎగరేస్తుంటారు. అయితే, ఆంద్ర ప్రదేశ్’లో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంతోటి గొప్ప పార్టీకి ఆంధ్ర ప్రదేశ్’లో ఒక ఎంపీ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు. ఎంపీ ఎమ్మెల్యే వరకు ఎందుకు, స్థానిక సంస్థలలోనూ ఒకటో అరో తప్పించి చెప్పుకోదగిన,గుర్తుంచుకోదగిన   ప్రాతినిధ్యం లేదు. 2019 ఎన్నికలో ఆ పార్టీకి పోలైన ఓట్లు ‘నోటా’ కంటే తక్కువ. ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో, ఐదో స్థానంలోనో ఆరో స్థానంలోనో వుంది. ఆ తర్వాత జరిగిన తిరుపతి లోక్ సభ, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కలేదు. అదే విధంగా ఈ మూడేళ్ళలో జరిగిన ఏ ఎన్నికలోనూ, బీజేపీ ఉన్నానని అనిపించుకున్న,ఉనికిని నిలుపుకున్న ఎన్నిక ఒక్కటి కూడా లేదు. నిజానికి ఏపీ రాజకీయాల్లో బీజేపీ నాన్ ప్లేయర్. ఆటలో అరటిపండు.

అయినా ఆపార్టీలో కొందరు నాయకులు తమ బలాన్నిఎక్కువగా లెక్కలేసుకుంటున్నారో ఏమో కానీ, తెలుగు దేశం పార్టీతో పొత్తు వద్దని తీర్మానాలు చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పినప్పటి నుంచి, అధికార వైసీపీ అనుకూలంగా వర్గం బీజేపీ నేతలు, బీజేపీ మళ్ళీ టీడీపీకి దగ్గరవుతుందేమో అని, భయ పడిపోతున్నారు. నిజానికి, చంద్రాబాబు నాయుడు సహా టీడీపీ నాయకులు ఎవరూ ఇంతవరకు బీజేపీతో పొత్తు గురించి ఒక్కమాటైనా మాట్లాడలేదు. అయినా, వైసీపీ అనుకూల నేతలు టీడీపీతో పొత్తు వద్దంటూ పార్టీ హైకమాండ్‌కు లేఖలు రాస్తున్నారు. సోషల్  మీడియాలో బీజేపీతో పొత్తు లేకుండా టీడీపీ అధికారంలోకి రాలేదని ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం 23 అసెంబ్లీ, 3లోక్ సభ స్థానలు మాత్రమే దక్కిన 2019 ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన టీడీపీకి 40 పైగా ఓట్లు వచ్చాయనేది నిజం. టీడీపీ లేకుండా ఏపీలో విపక్షమే లేదు. 

నిజానికి బీజేపీకి మొదటి నుంచీ కూడా టీడీపీ సహజ మిత్ర పక్షంగా ఉంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న ప్రతి సందర్భంలోనూ ఉభయ పార్టీలు ప్రయోజనం పొందాయి. ఒక చేత్తో చప్పట్లు కొట్టడం ఎలాగైతే, అయ్యే పని కాదో, అదే విధంగా ఎన్నికల పొత్తుల  విషయంలోనూ అంతే, ఉభయ తారకంగా ఉంటేనే పొత్తు నిలుస్తుంది. వన్ సైడ్ లవ్ పెళ్లి పీటల వరకు రాదు.  అయితే, బీజేపీలోని వైసీపీ వర్గం, అన్ని విధాల అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ గెలిచినా ఓకే కానీ, టీడీపీ గెలవకూడదన్నవిధంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆయన వర్గానికి చెందిన పుంజీడు మంది నాయకులు సమయం సందర్భం ఏదైనా, టీడీపీతో పొత్తుల గురించే మాట్లాడుతున్నారు. నిజానికి, ఇంతకు ముందే అనుకున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఎవరూ, బీజేపీతో మళ్ళీ పెళ్లి గురించి మాటవరసకు అయినా ఒక్క మాట మాట్లాడలేదు. అంతే కాదు, ఇంతవరకు టీడీపీ పొత్తుల ప్రస్తావనే తీసుకురాలేదు. 

బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనంతట తానుగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక  పాలనను అంతమొందించేందుకు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని అన్నారు.వైసీపీ వ్యతిరేక ఓటులో మేజర్ చుంక్ ( 40 శాతానికి పైగా) టీడీపీ ఓటే వుంది. టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదన  తెచ్చింది, బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయినా, ఒక శాతం ఓటైనా లేని బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాదుతోందని, వైసీపీ అనుకూల బీజేపీ వర్గం నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.