తమిళ రాజకీయాల్లో డిఎంకే ఫైల్స్ సంచలనం

Publish Date:May 1, 2023

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిఎంకే ఫైల్స్ పేరిట విడుదల చేస్తున్న డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ఫ్యామిలీ అవినీతి కథలు నమ్మశక్యం కాని నిజాలను బయట పెడుతున్నాయి. స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలను, అఫిడవిట్‌లో వెల్లడించని ఆస్తుల వివరాలను పోల్చుతూ అన్నామలై వీడియో విడుదల చేసి ప్రకంపనలు సృష్టించారు.

లెక్కల్లో చూపని ఆస్తుల చిట్టాను అన్నామలై బట్టబయలు చేశారు. ఒక్క స్టాలిన్ ఆస్తులే కాదు.. డీఎంకే మంత్రుల ఆస్తులను కూడా వీడియోలో పూసగుచ్చినట్టు వివరించారు. తమిళనాడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతల చిట్టాను అన్నామలై విడుదల చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో సీఎం స్టాలిన్ తో పాటు  డీఎంకే నేతలు 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు అన్నామలై.  డీఎంకే నేతల ఆస్తుల చిట్టాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌  ద్వారా ఆ వీడియోలో ఇచ్చారు. అంతే కాదుముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిథి  స్టాలిన్, అల్లుడు సబరీసన్.. ఒకే ఒక్క సంవత్సరంలో రూ.30 వేల కోట్లు సంపాదించారని, అన్నామలై ఆరోపించారు.

అంతే కాదు, ముందు ముందు మరిన్నిఎపిసోడ్స్ విడుదల చేస్తామని అన్నమలై ప్రకతించారు. అన్నట్లుగానే సెకండ్ ఎపిసోడ్ కూడా విడుదలైంది. మరోవైపు.. ట్విటర్‌లోనూ తమిళనాడు బీజేపీ యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ట్విటర్‌లో డీఎంకే ఫైల్స్, అన్నామలై ట్రెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బీజేపీ డీఎంకే ఫైల్స్‌పై తమిళనాడు అధికార పార్టీ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి ‘డీఎంకే ఫైల్స్ ఒక జోక్’ అని కొట్టిపారేశారు. అయితే, మరో వారం  పది రోజుల్లో మే 7 ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్టాలిన్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయోపోయిందని,ఇక ముందు స్టాలిన్ ఇంటా బయటా సమస్యలను ఎదుర్కోక తప్పదని  పరిశీలకులు అంటున్నారు. 

మరో వంక ముఖ్యమంత్రి స్టాలిన్’ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలెట్టినట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత పవర్ లోకి వచ్చి డిఎంకే ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల పనితీరును, సామర్థ్యాన్ని పరిశీలించిన సీఎం..  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే గాక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు పరుగెత్తాలన్నా, శాఖల వారీగా పలు కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలన్నా ఔత్సాహికులైన సమర్థవంతమైన మంత్రులు ఉండాలని సీఎం యోచిస్తున్నారు. ఆ ఎన్నికలను ఏ మాత్రం అలక్ష్యం చేసినా, ప్రతిపక్ష అన్నాడీఎంకేకు తగినన్ని సీట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినా, మునుముందు తమ పార్టీ కష్టపడాల్సి ఉంటుందని సీఎం భావిస్తున్నారు.

అందుకే ప్రతిపక్షం కోలుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించి కింది స్థాయిలోనూ పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయగలిగే వ్యక్తులు మంత్రివర్గంలో ఉండాలని స్టాలిన్‌  యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సీనియర్‌ మంత్రులను తన టీం నుంచి తొలగించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. శాఖల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమర్థనీయంగా నిర్వహించలేకపోవడం, అధిష్ఠానాన్ని పట్టించుకోకపోవడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పులు వుండవచ్చని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

అయితే సీనియర్ మంత్రులను తొలిగించడం అంత ఈజీ వ్యవహారం కాదని  ముఖ్యంగా అనేక సంక్షోభాలు చుట్టుముడుతున్న ప్రస్తుత పరిస్థితులలో సీనియర్లను తొలిగిస్తే అది కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.