కర్ణాటక సీఎంగా 30న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం?

Publish Date:May 27, 2026

Advertisement

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం: మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!
 కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో  మార్పు  చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం (మే 30) నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  

ఢిల్లీ వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో డీకే శివకుమార్   కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి ఆయనకు సీఎం పీఠం దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా అధిష్టానం సిద్ధరామయ్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.  

ఈ అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా  చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు  రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ శనివారం (మే30)  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు  ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు.  ఇందుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు. 

కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాల సమయంలోనే ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు.   ఆ సమయంలో అధిష్టానం ఇద్దరు నేతలను ఒప్పించి అధికార పంపకాల ఫార్ములాను కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు నిర్ణీత కాలపరిమితి ముగియడంతో సిద్ధరామయ్య తప్పుకుని, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రానున్న రెండు రోజుల్లో ఈ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   

By
en-us Political News

  
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.