దీపావళి వేడుకల్లో అపశ్రుతి.. బాణసంచా కాల్చుతూ 15 మందికి కంటి గాయాలు.!

Publish Date:Nov 8, 2026

Advertisement

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు కంటి గాయాల బారినపడ్డారు. టపాసులు పేల్చే క్రమంలో నిప్పురవ్వలు కళ్లలో పడటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గాయపడిన వారు చికిత్స కోసం మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రికి బాధితుల తాకిడి పెరిగింది.ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వివరాలు వెల్లడించారు. 

ఇప్పటివరకు బాణసంచా కారణంగా కంటి గాయాలైన మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. వీరిలో గాయాల తీవ్రతను పరిశీలించిన వైద్యులు ఐదుగురిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. మరో పది మందికి ఔట్ పేషెంట్ విభాగంలో ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన వైద్య సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఐదుగురిలో నలుగురు చిన్నారులు ఉండగా, మరొకరు పెద్దవారని వైద్యులు తెలిపారు. 

అయితే బాధితుల్లో ఎవరికీ చూపు కోల్పోయేంత తీవ్రమైన గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సకాలంలో వైద్య చికిత్స అందించడంతో పరిస్థితిని అదుపులో ఉంచగలిగామని పేర్కొన్నారు.దీపావళి వేడుకలు ఇంకా కొనసాగుతుండటంతో వారాంతంలో మరిన్ని కంటి గాయాల కేసులు వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.

మరోవైపు, బాణసంచా కాల్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిస రిగా పర్యవేక్షించాలని, పిల్లలను ఒంటరిగా బాణసంచా కాల్చేందుకు అనుమతించవద్దని హెచ్చరిస్తున్నారు. కళ్లకు గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే యువత అత్యుత్సాహం తో చేతిలోనే బాణసంచా కాల్చడం, ప్రమాదకరమైన సాహసాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పాటి నిర్లక్ష్యం కూడా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, పండుగ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలే తప్ప ప్రాణాలకు, చూపు నకు ముప్పు తెచ్చుకు నేలా వ్యవహరించవద్దని సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై ఎస్ఈసీ కీలక ప్రకటన.! 

 

[  Diwali Celebrations Firecracker Injuries hyderabad, Eye Injuries, Sarojini Devi Eye Hospital, Mehdi Patnam, Firecrackers, Eye Hospital, Children Injured, Ophthalmology, Dr Ibrahim, Diwali Safety, Firecracker Accidents, Eye Care, Safety Precautions ]


 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.