కేసీఆర్.. కేటీఆర్ మధ్య ఎడం పెరిగిందా..?

Publish Date:Aug 23, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తథ్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి.  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.

అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం లేదు. అందుకు కారణం కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చక పోవడమే అని అంటున్నారు. కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచీ ఆయన ఇప్పుడో అప్పుడో ముఖ్యమంత్రి కావడం ఖాయమని విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే ఆ ముహూర్తం ఇంత వరకూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే తండ్రి తనకు సీఎంగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో చేస్తున్న తాత్సారం పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎంగా కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడం ఖాయమన్న రీతిలో పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం పూర్తిగా నిలిచిపోయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వేసిన అడుగులను ఒక్కటొక్కటిగా వెనక్కు తీసుకునే పరిస్థితులు ఎదురవ్వడంతో ఆయన ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ ను అధికారంలోనికి తీసుకు రావడంపైనే దృష్టి సారించారు. దీంతో కేటీఆర్ కూడా నిర్వేదానికి గురయ్యారని అంటున్నారు.

అందుకే ఇటీవల ఒక సందర్భంగా   మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు.  ఈ కారణంగానే తండ్రి కొడుకుల మధ్య ఒకింత ఎడం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అందకు తగ్గట్టుగానే తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకే వేదికపై ఇటీవలి కాలంలో కనిపించిన దాఖలాలు లేవు. ఆఖరికి స్వాతంత్ర్య వజృత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ కనిపించలేదు. కేటీఆర్ మొత్తంగా పార్టీ కార్యక్రమాలకూ, సభలూ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు. ఆయన ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలూ, ప్రారంభోత్సవాలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అయితే తండ్రితో మాత్రం వేదిక పంచుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఎదురుపడుతున్న దాఖలాలే లేవు.

కేసీఆర్ పాల్గొంటున్న సభలలో కేబినెట్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఒక్క కేటీఆర్ తప్ప. దీంతోనే పరిశీలకులు ఇరువురి మధ్యా ఏదో జరిగిందనీ, తండ్రీ కొడుకుల మధ్య ఎడం పెరిగిందనీ అంటున్నారు. అందుకు కేటీఆర్ సీఎం ఆకాంక్షకు కేసీఆర్ ఎప్పటికప్పుడు కళ్లెం వేయడమేనని విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే.. కేసీఆర్ తనయ కవిత కూడా ఇటీవలి కాలంలో పెద్దగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 22)న మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు. అలాగే బోనాల సందర్బంగా బంగారు బోనం సమర్పింస్తూ మీడియా ముందుకు వచ్చారు. చాలా వరకూ ఆమె పార్టీ కార్యక్రమాలకు, బహిరంగ సభలకూ దూరంగానే ఉంటున్నారు. ఇలా కుమారుడూ,కుమార్తె కూడా తండ్రితో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీనిపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నప్పటికీ కుటుంబ కలహాలు కారణమని మాత్రం గట్టిగా వినిపిస్తున్నది. అది కూడా కేటీఆర్ సీఎం ఆకాంక్ష నెరెవేర్చే విషయంలో కేసీఆర్ చేస్తున్న తాత్సారమే కారణమని అంటున్నారు.

అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  

మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు.   భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారు. హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎవరూ కేటీఆర్ సీఎం అన్న మాటే మాట్లాడటం లేదు. అసలా ప్రతిపాదనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామమే కేసీఆర్ పట్ల కేటీఆర్ అలకబూనడానికి కారణమని విశ్లేషణలు వినవస్తున్నాయి.  

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.