కేసీఆర్ లో గజ్వేల్ ఉప ఎన్నిక భయం.. అసెంబ్లీకి ఒక్క రోజు హాజరు అందుకేనా?

Publish Date:Mar 21, 2025

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ   రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తాను మళ్లీ క్రియాశీలం అవుతాననీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాననీ చెబుతూ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారానికి దూరమైన ఈ 15 నెలల్లోనూ ఆయన అసెంబ్లీకి హాజరైంది కేవలం రెండు సార్లు మాత్రమే. రెండు మూడు సార్లు మాత్రమే బహిరంగంగా సభలలో మాట్లాడారు.

అంతే మిగిలిన కాలమంతా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన తాను రాజకీయంగా క్రియాశీలం అవుతాననీ, అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీస్తాననీ గట్టిగా చెప్పారు. అన్నట్లుగానే అసెంబ్లీకి వచ్చారు. అదీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు మాత్రమే. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. యథాప్రకారం ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఈ 15 నెలల కాలంలోనూ ఆయనను ఎవరైనా కలవాలనుకున్నా.. లేదా ఆయన ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా వేదిక ఫామ్ హౌస్ మాత్రమే.   ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అప్పుడూ అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు.   ప్రస్తుతం సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది కానీ కేసీఆర్  మాత్రం సభకు రాలేదు. దీంతో ఆయన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీకి వచ్చింది. మొక్కుబడి తంతుకోసమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణులలో కూడా వ్యక్తం అవుతోంది. 

ఆయన అసెంబ్లీకి హాజరైంది.. కేవలం హాజరు కోసమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం   శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే గైర్హాజరుగా ప్రకటించవచ్చు.  అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో  కేసీఆర్ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి భయపడుతున్నారా? అందుకే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీలో హాజరు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ కాలం నుంచీ ఉప ఎన్నికలను పార్టీ పటిష్ఠతకు, ఉద్యమ బలోపేతానికి అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక అంటేనే భయపడుతున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం అనర్హత   వేటు నుంచి తప్పించుకోవానికే కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారా, ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ ను ఫాలో అయ్యారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  15 నెలల్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా  57లక్షల 84 వేల124 రూపాయల వేతనం తీసుకున్నారనీ, కానీ అసెంబ్లీకి హాజరైంది మాత్రం కేవలం రెండు రోజులేననీ ఎద్దేవా చేశారు. అయితే ఆ విమర్శలను, ఎగతాళిని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేం.. అనర్హత వేటు నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్లుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఫాలో అవుతున్నట్లు తోస్తోంది. అందుకే జగన్ లానే కేసీఆర్ కూడా అసెంబ్లీకి  మొక్కుబడిగా ఒక రోజు హాజరై..మళ్లీ ముఖం చూపడం లేదు.

వాస్తవానికి దేశంలో ఉప ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా, సమర్ధంగా పార్టీ పురోగతికి, బలోపేతానికి వాడుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో  ఆయన ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు తెరలేపేవారు.  అప్పట్లో ఆయన తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ఉద్యమ స్ఫూర్తి ఇసుమంతైనా తగ్గకుండా ఉంచేవారు. అటువంటిట కేసీఆర్ ఇప్పుడు.. ఉప ఎన్నిక అంటే భయపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వ్యవహరిస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో పరాజయాన్ని చవి చూశారు. గజ్వేల్ లో విజయం సాధించారు. కామారెడ్డి పరాజయంతో ఆయన ఇప్పుడు తనపై అనర్హత వేటు పడి గజ్వేల్ కు ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని నిలుపుకోవడం కష్టం అని భావిస్తున్నారనీ, అందుకే   శాసనసభ్యత్వాన్ని కాపాడుకుని, ఉప ఎన్నిక ముప్పును నివారించడానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున హాజరయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.