తెలంగాణ బీజేపీలో మరోసారి భగ్గుమన్న అసంతృప్తి!
Publish Date:Feb 15, 2025
.webp)
Advertisement
తెలంగాణలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలో కూనారిల్లుతోంది. ఆ పార్టీకి రాష్ట్రంలో బలం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఆ పార్టీ హైకమాండ్ కు మెండుగా ఉంది. అందుకే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలక ముందు కూడా ఆ పార్టీలో ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే తరువాయి అన్నంత ధీమా వ్యక్తం అయ్యింది. అయితే ఎన్నికల సమయానికి పార్టీ చతికిల పడింది. కనీసం డబుల్ డిజిట్ స్థానాలు కూడా సాధించలేక చతికిల పడింది. అదే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మళ్లీ బలంగా పుంజుకున్నట్లు కనిపించింది. లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా స్దానాలను సాధించింది. ఇక అప్పటి నుంచీ 2028 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయడం మొదలెట్టింది. అయితే తెలంగాణలో బీజపీ పరిస్థితి బలపడినట్లు బలపడి ఒక్కసారిగా జావగారిపోవడంలా తయారైంది. ఈ పరిస్థితికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో స్థానిక ఎమ్మెల్యే మాటకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీ నాయకత్వం తనను అవమానించిందన్నారు. అంతే కాకుండా జిల్లాల అధ్యక్షుల ఎంపికలో పార్టీ హైకమాండ్ పారదర్శకత పాటించలేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి.. తన గుడ్ లుక్స్ లో ఉన్న ఒకరిద్దరి సలహాల మేరకు హైకమాండ్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోల్కొండ, ఘోషామహల్ జిల్లా పార్టీ ఇన్ చార్జిగా ఉమామహేంద్ర నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజా సింగ్ అయితే బయటపడి బాహాటంగా విమర్శలు గుప్పించారు. కానీ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, మొదటినుండి పార్టీ కోసమే కష్టపడినవారిని విస్మరించి, మధ్యలో వచ్చిన వారిని పార్టీ హైకమాండ్ అందలం అందిస్తోందని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోల్కొండజిల్లా ఇన్ చార్జిగా బీజేపీ హైకమాండ్ నియమించిన ఉమామహేంద్రకు ఎంఐఎం నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నది రాజాసింగ్ ఆరోపణ. తాను మొదటి నుంచీ ఏంఐఎంపై పోరాటం చేస్తున్నాననీ, ఇప్పటి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ ఎంఐఎం నేతలకు సన్నిహితుడిగా మెలుగుతున్న వ్యక్తిని నియమించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఇలాంటి ఫీలింగే పలు జిల్లాల అధ్యక్షుల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఉంది. అయితే వారు బహిరంగంగా చెప్పడం లేదంతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక్క విషయంలోనే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యమే. అలాగే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు అందరికీ తెలిసిన విషయమే. ఎంపీలు, ఎంఎల్ఏల సిఫారసుల ప్రకారం కాకుండా తన మద్దతుదారులే జిల్లాల అధ్యక్షులుగా ఉండాలన్న కిషన్ ఆలోచన కారణంగానే చాలాచోట్ల వివాదాలు రేగుతున్నాయని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఇప్పుడు అసలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్న తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఆ పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం చేపట్టీపట్టగానే పార్టీలో అసంతృప్తి ఒక్క సారిగా భగ్గు మంది. 23 జిల్లాలకు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను నియమించింది.
వాటిలో గోల్కొండ గోషామహల్ నియోజకవర్గ అధ్యక్షుడి ఎంపిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినాయకత్వంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
http://www.teluguone.com/news/content/disidence-in-telangana-bjp-39-192939.html












