పరిమళ్ నత్వానీకి నిరాశే!

Publish Date:Jun 6, 2026

Advertisement

భారతీయ కార్పొరేట్ రంగంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అత్యంత ప్రభావమంతమైన వ్యూహకర్తగా, బలమైన లాబీయిస్ట్ గా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి ఈసారి నిరాశే మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు  రాజ్యసభలో చక్రం తిప్పిన నత్వానీకి..  2026 రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడా చోటు దక్కలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు. 

పరిమళ్ నత్వానీ రాజకీయ ఒక సారి  పరిశీలిస్తే ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఆరితేరారని అర్థమవుతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత నమ్మకస్తుడైన నత్వానీ, 2008లో మొదటిసారిగా జార్ఖండ్   నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగారు. ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా చెందని వ్యక్తి అయినప్పటికీ..  తనకున్న కార్పొరేట్ నెట్‌వర్క్, అద్భుతమైన లాబీయింగ్ వ్యూహాల ద్వారా స్థానిక ప్రాంతీయ పార్టీల మద్దతు  కూడగట్టుకుని అప్పట్లో సంచలన విజయం సాధించారు. ఆ విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ..  మళ్లీ 2014లో కూడా అదే జార్ఖండ్ నుండి రెండోసారి కూడా ఇండిపెండెంట్ గా  పెద్దల సభలో అడుగుపెట్టారు. జార్ఖండ్ లాంటి గిరిజన ప్రాధాన్యత, సంక్లిష్ట రాజకీయాలు ఉన్న రాష్ట్రంలో ఒక గుజరాతీ పారిశ్రామికవేత్త వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్ గా గెలవడం అప్పట్లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.

అయితే, 2020 నాటికి జార్ఖండ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడంతో నత్వానీ   ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. నాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగి..  నాటి ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ  వైసీపీ కోటా నుండి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. జగన్   తన సొంత పార్టీకి చెందిన ఎందరో సీనియర్ నేతలను, ఆశావహులను పక్కనబెట్టి మరీ నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు  పంపారు. ఈ విధంగా రెండుసార్లు జార్ఖండ్ నుండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం మూడు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  

ప్రస్తుత 2026 ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో, ఆ పార్టీకి ఈసారి ఒక్క రాజ్యసభ సీటును కూడా సొంతంగా గెలుచుకునే సంఖ్యాబలం  లేదు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాలనూ అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే  దక్కబోతున్నాయి.  మరోవైపు జార్ఖండ్‌లోనూ ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములు స్థానిక క్యాడర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కూడా నత్వానీకి మొండిచేయే ఎదురైంది. దీంతో..  ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశ రాజకీయాలను శాసించిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ, ఈసారి ఏ రాష్ట్రం నుంచీ మద్దతు లభించక పెద్దల సభకు దూరమై మాజీ ఎంపీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

By
en-us Political News

  
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.