ఈడీ విచారణకు పూరి జగన్నాథ్, ఛార్మి

Publish Date:Nov 17, 2022

Advertisement

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ ను, నటి, నిర్మాత చార్మిని వివాదాల్లోకి లాగింది. సినిమా చిత్రీకరణ నుంచి ప్రచారం, విడుదల, ఆ తరువాత ఫలితం, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఆ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయమూ, ప్రతి అంశమూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. తాజాగా ఇప్పుడా చిత్రానికి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న విషయంపై ఈడీ కూపీలాగుతోంది.

ఇందు కోసం పూరీ జగన్నాథ్ ను, నటి ఛార్మీని విచారణకు పిలిచింది. ఈడీ పిలుపు మేరకు పూరి జగన్నాథ్, ఛార్మీలు గురువారం హైదరాబాద్ లోకి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిలు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఒక సారి ఎక్సైజ్ అధికారుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇరువురికీ కూడా క్లీన్ చిట్ లభించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు లైగర్ సినిమాలో పెట్టుబడులు ఎక్కడ నుంచి  వీరిద్దరు కలిసి ఇటీవల విజయ్ దేవర కొండ హీరోగా  ‘లైగర్’ మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథే.   పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినీమా విడుదలైన తరువాత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.  అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు సేకరించారని చెబుతున్నారు.

అంతే కాకుండా  ఈ సినిమాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.   మొత్తంగా ఈడీ పూరి జగన్నాథ్, ఛార్మీలను విచారించడం సంచలనం సృష్టించింది. ఈ విషయంపై సినీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.