బాపుగారి పుట్టినరోజు
Publish Date:Dec 15, 2013
Advertisement
బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్ళు తొక్కగానే..గీతలు అందాలు దిద్దుకోగానే…మాటలు బిడియం ఒలికించగానే..రాతలు వినయం తొణికించగానే..రమణ స్నేహంలో రూపం మూర్తి కట్టగానే…బుడుగు అల్లరి స్పురణకు రాగానే…రాముని దయ స్మరణకు రాగానే మన కళ్లముందు కనిపించే నిలువెత్తు తెలుగుదనం బాపు. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు పుట్టిన రోజు నేడు ఆ సందర్భంగా ఆ మహానుభావుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఆయన సినిమాలు చూస్తుంటే.. వేసవికాలంలో మల్లెతోటల్లో విహరించినట్టూ.. ఆరుబైట వెన్నెల్లో చందామామను చూస్తూ హాయిగా నిదురించినట్టూ.. మధురంగా ఉంటుంది. ఊహకు ఊపిరిపోస్తే.. దానిపేరు బాపుబొమ్మ, సౌందర్యాన్ని దృశ్యీకరిస్తే.. అది బాపు సినిమా.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అరుదైన దర్శకుడు బాపు. ఆయన సెట్ చేసిన ఒక్కో ఫ్రేమ్.. ఒక్కో చిత్రపటమే. ఆయన గీసిన బొమ్మలేకాదు.. ఆ కెమెరా కన్నుల్లో చిక్కిన ప్రతి హీరోయిన్ ఓ బాపూబొమ్మే. అందుకే బాపు సినిమాల్లో నటించడమంటే.. వారి అందానికి దక్కిన గొప్పగౌరవంగా భావిస్తారు. బాపు ఫ్రేమ్ లో ఒక్కసారైనా కనిపించాలని పరితపిస్తారు.
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆంద్రపత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణంనుంచే చూశారు.. తీశారు.. బాపు.. అందుకే రామాయణంలోని ప్రతిఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది బాపు భక్తి.
క్రియోటివ్ జీనియస్ బాపుని ఎన్నో అవార్డ్స్ వరించాయి. మదర్ థెరీసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నందీ అవార్డ్స్ తోపాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి.
స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్ పై బొమ్మగీసినట్టు బహు ముద్దుగా ఉంటుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీస్తున్న బాపుగారికి గురువంటూ ఎవరూ లేరు. స్త్రిప్ట్ బాగుంటే చాలు డైరెక్టర్ ఐపొవచ్చు అని బాపు గారిని చూసి నేర్చుకోవచ్చు.
బాపు గురించి మాట్లాడుకునేట్టపుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరు ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవనం ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది. కాని విధి అన్ని సార్లు అనుకూలంగా ఉండదుకదా. అందుకే వారిద్దరిని విడదీసింది. బాపు అందాల దృష్యానికి పలుకును దూరం చేసింది. రమణ తన సాహితీ సంపదను మనకు వదిలేసి బాపును ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.
భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు బాపు. కళాత్మకత, భావుకత, స్వచ్ఛత.. వెరసి బాపు సినిమాలుగా రూపుదాల్చాయి. బాపు సినిమాలకోసం ప్రేక్షకుల ఎదురుచూపు సాగుతూనే ఉంటుంది.. కొనసాగుతూనే ఉంటుంది. బాపు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
http://www.teluguone.com/news/content/director-bapu-birthday-special-32-28403.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





