దిమాగీ నక్సల్స్ పార్టీ.. ఇన్ స్టా గ్రామ్ లో లక్షల ఫాలోవర్లు.!

Publish Date:Aug 17, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో  ఉపయోగించిన దిమాగీ నక్సల్ పదం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దిమాగీ నక్సల్ అన్న పదం రాజకీయవర్గాలలోనే కాకుండా నెటిజనులలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 

మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ..  అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని తుడిచిపెట్టామని చెప్తూనే..  సిద్ధాంతపరంగా ఆలోచనల్లో ఉండే  దిమాగీ నక్సల్స్ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే  ఇన్‌స్టాగ్రామ్‌లో  దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో ఒక  ఖాతా ప్రత్యక్షమైంది. ఈ ఇన్ స్టా ఖాతాకు నెటిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది.

దిమాగీ నక్సల్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ  ప్రారంభమైన 24 గంటల వ్యవధిలోనే  1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి రికార్డు సృష్టించింది.    ఇప్పటి వరకూ  ఈ ఖాతాలో 62 పోస్టులు ఉన్నాయి.  ఈ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించి వైరల్ అవుతున్న  దిమాగీ నక్సల్ పార్టీ పేజీ  ఎవరు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?  అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. పేజీ నిర్వాహకులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచడం, కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వెల్లడించకపోవడం సస్పెన్స్ గా మారింది. ఇది  మోదీ వ్యాఖ్యలకు నిరసనగా సృష్టించిన వేదికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

Dimagi Naxal, Narendra Modi speech, Instagram viral page, Dimagi Naxal Party, 16 lakh followers, Independence Day Modi comments

By
en-us Political News

  
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.