వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియోపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Publish Date:Aug 23, 2022

Advertisement

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం రాష్ట్రపతిని కలిసి డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం  ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు భయాందోళనల మధ్య  జీవనం సాగిస్తున్నారని, గత మూడూళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి అసభ్యకర ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను అమలు చేయాలని రాష్ట్రపతిని కోరారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధించాలని, ఆ మేరకు వర్మ కమిషన్ సిఫార్సులను కఠినంగా అమలు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఎన్నికైన ప్రతినిధులు ఈ తరహా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటే తక్షణమే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అందరికీ లింగబేధం, లింగవివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణనివ్వాలని సూచించారు. – ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా… లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినా.. వెంటనే సూమోటోగా కేసులు నమోదు చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సమన్లు జారీ చేసి విచారణ జరపాలని కోరారు.

  వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ , ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి , తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.