పేట్రేగిపోతున్న వైసీపీ బకాసురులు! ;పోలవరం కాల్వనే తవ్వేస్తూ మట్టిదందా!

Publish Date:Nov 10, 2023

Advertisement

ఏపీలో అధికార  వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమ రిజిస్ట్రేషన్ల స్కాం ను స్వయంగా వైసీపీ నేతే బయటపెట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లే కాదు.. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా మట్టి తవ్వకాలు, అనుమతులు లేకుండానే కొండలను పిండిచేసి తవ్వేయడం ఇలా ఎన్నో అక్రమాలు వైసీపీ సర్కార్ అండతో వైసీపీ నేతలు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు వైసీపీ నేతల చీకటి వ్యాపారం మరొకటి  వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు రాత్రికి రాత్రి పోలవరం కుడికాలువను తవ్వుకొని మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి  బట్టబయలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో పలు చోట్ల రాత్రయితే చాలు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చీకటి వ్యాపారం మొదలవుతుందన్న ఆరోపణలున్నాయి. ప్రతి రోజూ రాత్రి 10 గంటల తర్వాత మొదలయ్యే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం ఉదయం 6 గంటల వరకూ సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ చీకటి వ్యాపారంలో భాగంగానే గత కొంత కాలంగా పెదవేగి మండలంలో పలు చోట్ల రాత్రిపూట పోలవరం కుడికాలను తవ్వుకొని యథేచ్ఛగా మట్టిని అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. గురువారం(నవంబర్ 9)  రాత్రి కూడా వైసీపీ మట్టి మాఫియా లారీలు, జేసీబీలతో పోలవరం కుడి కాలువను తవ్వేస్తుంటే.. స్థానిక టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సమాచారం ఇచ్చారు. తన అనుచరులు, గ్రామస్థులతో పోలవరం కాలువ వద్దకు చేరుకున్న చింతమనేని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో మా వాహానాలే ఆపుతారా అంటూ వైసీపీ నాయకులు రెచ్చిపోయి దుర్భాషలాడారు. వైసీపీ మట్టి మాఫియాపై గురువారం అర్ధరాతి అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. దీంతో గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు సహా చింతమనేని తెల్లవారే వరకూ అక్కడే వేచి ఉన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం తొమ్మిది టిప్పర్లు, రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి పెదవేగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

పెదవేగి మండలంలో ఈ అక్రమ తవ్వకాలు ఈనాటివేమీ కాదు. గత ఏడాది జనవరిలోనే పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలను చింతమనేని వెలుగులోకి తెచ్చారు. పగటి సమయంలో మీడియాను తీసుకెళ్లి మట్టి తవ్విన ప్రాంతాలను చూపించారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి నుండి అధికారుల నుండి ఎలాంటి చర్యలూ లేవు. ఈ ఏడాదిన్నరగా తెగ రెచ్చిపోయిన వైసీపీ మట్టి బకాసురులు యథేచ్ఛగా రాత్రిళ్ళు కాలువను తవ్వేస్తున్నారు. స్థానికులు, గ్రామస్థులు ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు ఈ మైనింగ్ మాఫియాకు తెగబడుతున్నాయనీ, ఆ కారణంగానే  అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే  ఇప్పుడు తవ్వకాలు జరుగుతుండగానే చింతమనేని ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి తెలుగుదేశం పట్టుకోవడంతో ఇక తప్పక  అధికారులు  వాహనాలను సీజ్ చేశారని అంటున్నారు. 

కాగా  అక్రమ తవ్వకాలను అడ్డుకున్న చింతమనేని, గ్రామస్థులపై వైసీపీ నేతలు తీవ్ర దుర్భాషలకు దిగారు. ఇదంతా మీడియా కవర్ చేస్తున్నా.. వీడియో రికార్డ్ అవుతున్నా లెక్క చేయని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. పెదవేగి మండలంలో అక్రమ తవ్వకాలు,  వైసీపీ నేతల దౌర్జన్యాలు అంటూ చింతమనేని సోషల్ మీడియాలో  ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా.. అది   వైరల్ అయ్యింది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి  పాలనలో వైసీపీ నేతలు ఎంతగా అక్రమాలకు పాల్పడుతున్నారో ఈ వీడియో మరోసారి కళ్లకు కట్టిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు కూడా వెనకాడకుండా బరితెగిండంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి జగన్ పాలన ఇంకానా వద్దు వద్దు అంటున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ డోంట్ నీడ్ జగన్ అంటూ రిటార్డ్ ఇస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.