తగ్గేదేలే.. వైసీపీలో కాకరేపుతున్న పిల్లి సుభాష్ కామెంట్స్!

Publish Date:Aug 29, 2023

Advertisement

ఎన్నికల ఏడాదిలో అధికార  వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,  విశాఖలో అవంతి,   గోదావరిలో పిల్లి చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తున్నది. కాస్త బుజ్జగించి.. మరికాస్త లాలించి ఈ నేతలను శాంతిపజేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా.. ఈ అంతర్గత చిచ్చు తగ్గినట్లే తగ్గి మళ్ళీ రాజుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరికి వారి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు ఆల్టిమేటాలు జారీ చేస్తున్నారు. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామచంద్రాపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇక్కడ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి జగన్ తోనే ఉన్న పిల్లిని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారు. అయితే, ఆ తర్వాత మండలి రద్దు చేస్తానంటూ పిల్లితో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ఈసారి ఎలాగైనా రామచంద్రపురం నుండి తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు.

కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన ఈసారి కూడా తనకే టికెట్ రావడం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొంత కాలంగా ఇక్కడ వార్ నడుస్తుంది. ఇప్పటికే పిల్లి సుభాష్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయనున్నట్లు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ పెద్దలు ఈ విషయంపై పిల్లి సుభాష్, ఎమ్మెల్యే చెల్లుబోయినతో సంప్రదింపులు జరిపి సీఎం జగన్ వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే చెల్లుబోయినను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నట్లు కూడా ఊహాగానాలు బయటకొచ్చాయి. దీంతో పిల్లి అప్పటికి కాస్త శాంతించినట్లు కనిపించారు. కానీ, ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తగ్గేదేలే అంటూ బయటకొచ్చారు.

తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తేల్చి చెప్పారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అవుతారని.. కార్యకర్తల అభీష్టాన్ని సీఎంకు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని.. తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. కానీ, ఎమ్మెల్యే చెల్లుబోయిన మాత్రం చాపకింద నీరులాగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జిల్లా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం వరకూ వీరవిధేయుడిగా ఉంటూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ సమస్య నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది. మొత్తం మీద రామచంద్రాపురంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు జగన్ కు తలనొప్పిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.