Publish Date:Jan 17, 2025
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కడం ప్రభుత్వ ప్రతిష్ఠను సైతం మసకబారుస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించింది. సీఎం పదవి కోసం పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను సముదాయించి.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా కలిసి పని చేసుకోవాలని సూచించింది. అప్పట్లో చెరో రెండేళ్లూ సీఎం అన్న ఒక ప్రతిపాదనకు ఇద్దరూ అంగీకరించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ముడా అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ముడా స్థల కేటాయింపుల విషయంలో సీఎం సిద్దరామయ్యపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గౌహ్లోత్ అనుమతి ఇచ్చారు. దీంతో సీఎంగా సిద్దరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతు దారులు రెండున్నరేళ్ల సీఎం ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ వ్యవహారం అలా సాగుతుం డగానే... తాజాగా మంత్రి సతీష్ జార్కిహోలీ ఓ టెలివిజన్ డిబేట్ లో డీకే శివకుమార్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపాయి. ఆయన కాంగ్రెస్ కర్నాటక అధ్యక్షుడిని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో విభేదాలను ఒక్కసారిగా రోడ్డున పడేశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే నాయకుడు ఉండాలన్నది సతీష్ జార్కి హోలీ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సీరియస్ గా స్పందించిన డీకే శివకుమార్.. పదవి అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్ మంజునాథ్ భండారీ సతీష్ జార్కిహోలీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా అటువంటి వ్యాఖ్యలు మానుకవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/differences-in-karnataka-congress-39-191406.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.