Publish Date:Oct 17, 2024
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తొలి నుంచీ కాంగ్రెస్ లో ఉండి, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తల పట్ల రేవంత్ చిన్న చూపు చూస్తున్నారన్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచీ పార్టీలో ఉన్న వారి పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత, కొత్త కాంగ్రెస్ విభేదాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రచ్చకెక్కాయి.
ధర్నాలు, నిరసనల రూపంలో రోడ్డున పడ్డాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి వ్యతిరేకంగా స్థానిక నేతలు ధర్నాకు దిగారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్నవారికి కాకుండా కడియం శ్రీహరి వర్గీయులకే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తున్నారనీ, పెద్దపీట వేస్తున్నారనీ ఆరోపిస్తూ కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ స్థానిక నేత సింగాపురం ఇందిర నాయకత్వం వహించారు. ఇందిర మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో కడియం వర్గీయులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ ఆ కమిటీలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/differences-in-congress-25-186928.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.