కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి అయిన రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో నిజంగానే నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేశారా? బీజేపీ విడుదల చేసి రచ్చ చేస్తున్న వీడియోల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లింది ఒక వివాహానికని చెబుతున్న మాటలలో నిజమెంత? ఇంతకీ ఆ వీడియోలలో కనిపిస్తున్న యువతి ఎవరు? ఆమెకూ రాహుల్ గాంధీకీ సంబంధం ఏమిటి?
వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే...బీజేపీ చెబుతున్నట్లుగా రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్న నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీతో ఉన్న యువతి ఎవరన్నది తెలియాలి. ఆమె పేరు సుమ్మిమా ఉదాస్. నేపాలీ అయిన ఆమె ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎస్ ఇంటర్నేషనల్ కు ఢిల్లీ ప్రతినిథిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె దేశంలో రాజకీయ, ఆర్థిక, పర్యావరణ, సామాజిక అంశాలకు సంబంధించి పలు ఆసక్తికర కథనాలతో సంచలనాలు ష్టించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుపై ఆమె కథనాలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే 2014 సార్వత్రిక ఎన్నికలను కూడా ఆమె సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఢీల్లీ ప్రతినిథిగా కవర్ చేశారు.
రాహుల్ గాంధీకి ఆమె మంచి ఫ్రెండ్. ఆమె వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లారు. ఆమె వివాహం గురువారం జరగనుంది. అందుకు సంబంధించిన రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఆ రిసెప్షన్ వేడుకలలో రాహుల్ పాల్గొన్న ఫొటోలే సామాజిక మాధ్యమంలో బీజేపీ పోస్టు చేసింది. అవి వైరల్ అయ్యి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
రాహుల్ గాంధీ తమ ఆహ్వానం మేరకే ఖాట్మండూ వచ్చారని సుమ్మిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ తెలిపారు. ఆయనా సామాన్యుడేమీ కాదు. దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు.
అసలు సంగతి ఇలా ఉంటే బీజేపీ కాదేదీ రాజకీయ రచ్చకు అనర్హం అన్నట్లుగా కొన్ని వడియోలను సోషల్ మీడియాలో వదలి రాజకీయ రచ్చ చేసింది. దేశంలో ఎలక్షన్ హీట్ ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడమే లక్ష్యంగా ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ విమర్శలు కురిపిస్తున్నది. వివాహానికి వెళ్లడమే బీజేపీ దృష్టిలో నేరమా అని నిలదీస్తున్నది. ఇలా ఉంటే దేశంలో క్రమంగా కాంగ్రెస్ బలపడుతోందన్న భావనతోనే కాంగ్రెస్ పై బురదజల్లి బలహీనపరిచే ఉద్దేశంతో బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ నేపాల్ పర్యటన రాజకీయ రాద్ధాంతానికి కారణమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/did-rahul-really-enjoyed-in-night-club-25-135409.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.