ఏపీలో బీజేపీ అటో ఇటో సీఎం రమేష్ తేల్చేసినట్లేనా?

Publish Date:Apr 14, 2023

Advertisement

బీజేపీ అటా.. ఇటా అన్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. సీఎం రమేష్,  సుజనా చౌదరి వంటి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ గూటికి చేరిన నాయకులు అన్యాపదేశంగానైనా ఏపీలో తెలుగుదేశం తో బీజేపీ పొత్తు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా పీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పాటు అనివార్యమన్న సంకేతాలు ఇచ్చారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కూటమే అని. అంటే ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ఉన్న బంధం కారణంగా బీజేపీ, వైసీపీల కూటమి  అని జనం పొరపడతారన్న అనుమానం ఆయనకే వచ్చిందో ఏమో.. వెంటనే రాష్ట్రంలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాష్ట్రంలో జనసేన, బీజేపీ మిత్ర పక్షాలన్న సంగతినీ గుర్తు చేశారు. అంటే బీజేపీ జనసేనతోనే ఉంటుందన్నది ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే ఆ జనసేన ఇప్పటికింకా అధికారికంగా ప్రకటించకపోయినా.. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టడం ఖాయమన్న సంకేతాలను విస్పష్టంగా ఇచ్చింది. ఇస్తోంది కూడా.

పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలపై జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోయినా.. గౌరవానికి భంగం కలగని రీతిలో పొత్తులు ఉంటాయని పదే పదే చెప్పడం, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటూ పదే పదే చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం తెలుగుదేశంతో పొత్తు ఉంటుందనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రమేష్ బీజేపీ కూటమిదే ఏపీలో అధికారం అనడం అంటే తెలుగుదేశం, జనసేనతో కలిసే బీజేపీ నడుస్తుందని చెప్పడమేనని విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ తెలుగుదేశంతో జట్టు కడుతుందా.. కట్టదా అన్నది పక్కన పెడితే.. ఆ పార్టీతో యుద్ధం చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రమూ లేదని, ఇటీవలి కాలంలో ఆ పార్టీ రాష్ట్ర నేతల స్వరంలో వచ్చిన మార్పును బట్టి ప్రస్ఫుటంగా అర్ధమౌతోంది. మొన్న మొన్నటి వరకూ తెలుగుదేశంపై విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో ఆ విమర్శల బాణాలను అధికార వైసీపీపై ఎక్కుపెట్టడం, ఇటీవల జనసేనాని హస్తిన పర్యటన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన వాణిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వినిపించడం వంటి వాటిని గమనిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలలో గుణాత్మక మార్పు గోచరించక మానదు.సీఎం రమేష్ మాటలు, వ్యాఖ్యలు కూడా రానున్న రోజులలో కమలం ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ ను మరింత గట్టిగా వినిపించే అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేస్తున్నాయి.  

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.