తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా?

Publish Date:Oct 28, 2022

Advertisement

తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా.. కలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాయా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడానికి బీజేపీతో అవగాహనే కారణమని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవైనా.. ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఈ ఎనిమిదేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

ఇప్పుడు ఈ క్యాడర్ అంతా బీజేపీతో కలిసి పని చేయనుందని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్యా మైత్రికి ఇరు పార్టీల అధిష్ఠానాలూ పచ్చ జెండా ఊపేశాయని కూడా చెబుతున్నారు. ఈ మైత్రి  ముందు ముందు ఏపీలో కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ముందుగా మునుగోడు ఉప ఎన్నికలో నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ అంతా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో  మునుగోడులో తెరాస, కాంగ్రెస్ ల పరాజయమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీలు కలిసి నడుస్తున్నాయని చెబుతున్నారు.

ఏపీలో కూడా ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో మిత్రులుగానే పని చేస్తాయన్న సంకేతాలు ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం నుంచీ, తెలుగుదేశం వైపు నుంచీ కూడా వస్తున్నాయనీ, ఇందుకు ఏపీలో బీజేపీతో పొత్త తమకు లబ్ధి చేకూరుస్తుందని తెలుగుదేశం భావిస్తుండటం.. తెలంగాణలో తెలుగుదేశంతో మైత్రి తమకు మేలు చేస్తుందని బీజేపీ భావించడం కారణమంటున్నారు. అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి.. అందుకే నాలుగేళ్ల కిందట తెగిన మైత్రి బంధం మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మళ్లీ ముడిపడుతోందని పరిశీలకులు అంటున్నారు.  

తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందనీ పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలన్న తమ ఆకాంక్ష నెరవేరేందుకు అనివార్యమన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఉందని అంటున్నారు.

అందుకే  ఏపీలో తెలుగుదేశంకు దగ్గరయ్యేందుకు వేస్తున్న అడుగులలో భాగంగానే వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వైసీపీని విస్పష్టంగా వ్యతిరేకిస్తూ అమరావతే ఏకైక రాజధాని అన్నదే తమ విధానమని బీజేపీ ప్రకటించడాన్ని ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.   

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.