యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా.. అందుకే రాజీనామా ధర్మేంద్ర భావోద్వేగం.!

Publish Date:Jul 25, 2026

Advertisement

 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యువత  ఆకాంక్షలను కలలను తాను గౌరవిస్తానని తెలిపారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు  యువత ఆకాంక్షలను, కలలను తాను గౌరవిస్తానని చెప్పారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు.. సరికొత్త భారతదేశానికి వారసులు యువతేనని పేర్కొన్నారు. 10 రోజులుగా జరిగిన సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు. 

తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని, అయితే ఇది తన వ్యక్తిగత పరువు లేదా రాజకీయ భవిష్యత్తు కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువత గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశం తో, దేశ ఐక్యతను కాపాడేందుకు, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు, విద్యార్థులు తమ సమయాన్ని చదువుపై, కెరీర్ నిర్మాణంపై వెచ్చించేలా చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు.  

చివరగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించిన మార్గదర్శక త్వానికి, నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన సహచర మంత్రులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవే తన జీవితంలో అత్యున్నత ధ్యేయమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సు లతో భవిష్యత్తులో కూడా మాతృభూమి, ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం తన సేవలు కొనసా గిస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖను ముగించారు.

Dharmendra Pradhan Resignation, NEET Paper Leak Issue, Union Education Minister, National News Telugu,CJP Protests, PM MODI


 

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తున్నాయి.
ఉద్యోగాలే లేకుంటే ఏఐ విజయం ఎందుకు.. మైక్రోసాఫ్ట్ బాస్ సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్షా వివాదం విద్యార్థుల ఆందోళనల నడుమ కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది
వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
వైరస్  వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు   ఆరోగ్య శాఖ సిబ్బంది  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను  గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.