బరితెగించిన దొంగలు...ఏకంగా ఏటీఎం మెషిన్‌నే ఎత్తుకెళ్లారు!

Publish Date:May 6, 2026

Advertisement

 

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత సాహసోపేతంగా, ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లి స్థానికులను, పోలీసులను విస్మయానికి గురిచేశారు. పట్టణంలోని పుట్టపర్తి రహదారిపై ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.  

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తొలుత ఏటీఎం మిషన్‌ను పగులగొట్టి అందులోని నగదును కాజేసేందుకు ప్రయత్నించారు. అయితే, యంత్రాన్ని తెరవడం సాధ్యం కాకపోవడంతో, వారు తమ ప్లాన్ మార్చారు. తమ వెంట తెచ్చుకున్న బొలెరో వాహనానికి ఏటీఎం యంత్రాన్ని తాళ్లతో గట్టిగా కట్టి, ఇంజిన్ బలంతో దానిని గూడు (బేస్) నుంచి పెకిలించారు.

యంత్రం ఊడి వచ్చే సమయంలో భారీ శబ్దం రావడంతో సమీపంలోని స్థానికులు మేల్కొన్నారు. ఏం జరుగుతుందోనని వారు బయటకు వచ్చేలోపే, దుండగులు ఆ భారీ ఏటీఎం యంత్రాన్ని చాకచక్యంగా బొలెరో వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితులు ధర్మవరం నుంచి బత్తలపల్లి వైపు వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ ఘటనతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారిపైనే ఉన్న బ్యాంకు కింద ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు ప్రయాణించిన వాహనం నంబర్ మరియు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే ఈ గ్యాంగ్‌ను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎంలో ఎంత నగదు ఉందనే విషయాన్ని లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. నిందితులు చిక్కితేనే ఈ భారీ చోరీ వెనుక ఉన్న అసలు రహస్యాలు వెలుగులోకి రానున్నాయి.

By
en-us Political News

  
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.