ఓటమి భయంతో ధర్మాన నోట ఉత్తరాంధ్ర ఉద్యమం

Publish Date:Dec 31, 2022

Advertisement

అధికార దాహం తలకెక్కితే, ఏమి జరుగుతుందో అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిరూపించాయి. అందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నసాక్ష్యం  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా  ప్రజల ఆకాంక్షల నుంచి, పుట్టిందే అయినా,  చివరకు రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రాష్త్రం ఏర్పడిన తర్వాత  ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో  ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తోంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కరకాలం పైగా జరిగిన మలి దశ ఉద్యమంలోనే 1200 మందికి పైగా యువతీ, యువకులు ప్రాణ త్యాగం చేశారు. అమర వీరులయ్యారు. కానీ, అంత మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం,ఇప్పడు ఎట్లుంది .. అంటే .. అమర వీరుల ఆశయాలను ఏ మేరకు నిజం చేసింది? అంటే ... అమరుల అత్మఘోషే సమాధానం అవుతుంది. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవో కొన్ని మేళ్ళు జరిగింది నిజమే కావచ్చును, అయినా ఇందుకేనా త్యాగాలు చేసింది? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే నిర్వేదం మాత్రం సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. 

ఇక అవశేష ఆంద్ర ప్రదేశ్ లో రాజకీయ బేహారులు మరో ప్రాంతీయ ఆందోళన తెర తీస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలమాట వినిపిస్తున్న సమయంలో రాజకీయ బేహారులు రంగ ప్రవేశం చేశారు. మూడు రాజధానుల వివాదాన్ని తెరమీదకు తెచ్చి, ప్రాంతీయ విద్వేషాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైంది. ఇంకా చిత్రం ఏమంటే, ఆ రెచ్చగొట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ కావడం. నిజమే మూడు రాజధానుల పేరిట ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నా, ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు  ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం  డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.అమరావతినే రాజధాని అని చంద్రబాబు అంటున్నారని.. అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించేశారు. 

ఎచ్చెర్లలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో.. ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించిన అంశాన్ని గుర్తు చేసుకుని ఆవేశాన్ని అభినయించారు.  ఉత్తరాంధ్ర పర్యటనలోనే  అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు చెప్పడం మన చేతులతో మన కళ్ళని పొడిచే ప్రయత్నమని ధర్మాన అభివర్ణించారు. అయితే ఇది ధర్మాన వ్యక్తిగత అభిప్రాయమా? వైసేపీ విధానమా? అనేది స్పష్టం కావలసి ఉంది.

అయితే, మూడు రాజధానుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని గమనిస్తే, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుకునే వ్యూహం దాగుందనేది కాదన లేని నిజం. అందుకే ఇది ధర్మాన సొంత అభిప్రాయం, అయినా, జగన్ రెడ్డి వ్యూహమే అయినా, ఇప్పటికే రాష్ట్ర విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి అనర్ధమే అవుతుందని విజ్ఞులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సారి ప్రాతీయ విద్వేషాగ్ని రాజుకుంటే, ఆర్పడం అంత తేలిగ్గా అయ్యే పని కాదని, అందుకు మళ్ళీ తెలంగాణనే కళ్ళముందున్న ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. పన్నెండేళ్ల అశాంతి అలజడి, పన్నెండు వందల ప్రాణాలు బలి, చివరకు మిగిలింది అదే రాజకీయ అరాచకం అని గుర్తు చేస్తున్నారు.

అదలా  ఉంటే, ధర్మాన ప్రసాద్ రావు .. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గిరాజేస్తున్నారని ప్రజలు, ప్రజాసంఘాలు మేథావులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, ఒకప్పుడు, మూడు రాజధానుల ఆలోచను ధర్మాన చాలా గట్టిగా వ్యతిరేకించారు.  అమరావతి ఒక్కటే రాజధాని అనే విధానాన్ని, ‘ఏకైక రాజధాని . .. అమరావతి’ నినాదాన్ని గట్టిగా సమర్ధించారు. కానీ ఇప్పడు అదే ధర్మాన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటున్నారు. అయితే తెలంగాణ అనుభవం తర్వాత ప్రజలు మరో ప్రాంతీయ ఆందోళనను ఎట్టి పరిస్థితిలోనూ సమర్ధించరని అంటున్నారు.

ప్రత్తుతానికి అది నిజమే కావచ్చును కానీ, ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడవలసి ఉందని అంటున్నారు. మరో వంక ఓటమి భయంతోనే  వైసీపీ, ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తోందనే అంటున్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అధికారం కోసం హైదరాబాద్ లో మత  కలహాలను రెచ్చగొడితే, ఇపుడు జగన్ రెడ్డి అధికారాన్ని నిలుపుకునేందుకు.. ప్రాతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.