Publish Date:Oct 28, 2024
ధర్మాన ప్రసాదరావు.. తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం. వైఎస్ హయాంలో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుడు. వైఎస్ మరణం తరువాత ధర్మాన ప్రసాదరావు వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీలో ఎన్నడూ ఆయనకు ఆయన స్థాయికి తగిన పదవి కానీ, ప్రాధాన్యత కానీ దక్కలేదు. అయినా ధర్మాన వైసీపీలోనే కొనసాగారు. ఇటీవలి ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన పెద్దగా ఎక్కడా కనిపించిందీ, వినిపించిందీ లేదు. ఇప్పుడు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఆ పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో కీలకంగా, చురుకుగా వ్యవహరించిన నేత. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ పై అంత కంటే ఎక్కువగా తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాజకీయ భవిష్యత్ పై ఎక్కవ ఆందోళనగా ఉన్నారు. మూడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నేతగా వెలుగొందిన ధర్మాన ప్రసాదరావు.. ఇప్పుడు రాజకీయ అండ కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి. రెండు సార్లు నరసన్నపేట నుంచి, మూడు సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు.. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. తన కంటే ఎంతో జూనియర్ అయిన గొండు శంకర్ చేతిలో పరాజయాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుయాయులు అంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే ధర్మాన పోటీకి విముఖత వ్యక్తం చేశారు. తన స్థానంలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ ను కోరారు. అయితే అందుకు జగన్ ససేమిరా అనడంతో అయిష్టంగానే బరిలోకి దిగారు. పరాజయం పాలయ్యారు.
ఇక అప్పటి నుంచీ ఆయన రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అదే సమయంలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఉండదని భావిస్తున్న ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన లేదా తెలుగుదేశం గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సిక్కోలు పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇరు పార్టీల నుంచీ కూడా ఆయన ప్రయత్నాలకు ఇంత వరకూ సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. ఒక దశలో ధర్మాన తెలుగుదేశం గూటికి చేరడం దాదాపు ఖరారైపోయిందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అవన్నీ ఒట్టి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు తాజాగా ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ విషయంలో ధర్మాన నుంచి కానీ రామ్ మనోహర్ నాయుడి గురించి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు కానీ, ధర్మాన ఎంట్రీకి నో చెప్పని జనసేనాని ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఒకింత సానుకూలంగా ఉన్నారని వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో వాస్తవాలపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dharmana-goodbye-to-ycp-39-187502.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.