ధరణి కోట టు ఎర్రకోట.. అమరావతి రైతుల మరో పోరు యాత్ర

Publish Date:Dec 15, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అందుకు భూములు ఇచ్చిన రైతులు  మరో పోరాటానికి సిద్దమయ్యారు. 2019, డిసెంబర్ 17వ తేదీన ఏపీ సీఎం వైయస్ జగన్.. ఏపీకి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు.. ఆయనా ప్రకటన చేసి 2022, డిసెంబర్ 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతుంది.

 ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. అమరావతి రైతులు ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు... పేరుతో దేశ రాజధాని ఢిల్లీకి పోరు బాట పట్టనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో రైతులు..  నిరసనలు తెలపనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతులు ధర్నా చేపట్టనున్నారు. అలాగే 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి.. వారికి ఈ తమ గోడును విన్నవించుకోనున్నారు. ఇక 19వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో  అమరావతి రైతులు పాల్గొననున్నారు. అదీకాక.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలు.. ఢిల్లీలోనే ఉంటారని.. వారందరినీ కలిసి.. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని రైతులు కోరనున్నారు.

అందుకోసం అమరావతి నుంచి 1800 మంది రైతులు... ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏపీకి  అమరావతే ఏకైక రాజధాని అని న్యాయస్థానం స్పష్టం చేసినా... జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై అమరావతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నాటి నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు.. వరుసగా నిరసనలు, దీక్షలు, యాత్రలలో పోరాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు.

అలాగూ అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు మరో మహాపాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద ఈ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ పాదయాత్ర ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  

అయితే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర... ఉత్తరాంధ్ర జల్లాల్లో ప్రవేశిస్తే.. పరిస్థితులు  ఎలా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ... జగన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోటీగా  ఆందోళనలు నిర్వహించేందుకు రంగం చేస్తుకొన్నారని సమాచారం. అలాంటి వేళ.. ఈ అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశిస్తే.. పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయని ఓ చర్చ సైతం బలంగా సాగుతోంది.   

మరోవైపు గతంలో శాతవాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. ఆ సమయంలో అమరావతిని ధాన్యకటకం.. ధరణికోట పేర్లుతో ప్రజలు పిలిచుకునే వారు. ఈ పేర్లను పురస్కరించుకొని. ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో అమరావతి రైతులు హస్తిన యాత్రకు శ్రీకారం చుట్టారు.

By
en-us Political News

  
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.