లక్ష్మి కార్డియాక్ అరెస్టుతో మరణించింది. 27 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించిన లక్ష్మిని కడసారి చూసేందుకు భక్త జన సందోహం తరలి వచ్చింది. తమిళనాడులోని మనాకుల వినాయకర్ ఆలయంలో లక్ష్మి దశాబ్దాల సేవలతో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రురాలైంది. అందరి అభిమానాన్నీ చూరగొంది. అలాంటి లక్ష్మి మార్నింగ్ వాక్ చేస్తూ ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది.
వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించిందని తేల్చారు. ఈ వార్త తెలియగానే భక్త జనసందోహం ఆలయానికి వచ్చింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారంతా లక్ష్మి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు.
ఇంతకీ లక్ష్మి ఎవరు, ఆమె మరణిస్తే భక్తులు కంటతడి పెట్టడమేమిటి అనుకుంటున్నారు. లక్ష్మి ఒక ఏనుగు. గత రెండున్నర దశాబ్దాలుగా వినాయకర్ ఆలయంలో సేవలందిస్తోంది. భక్తులందరికీ ఏనుగు లక్ష్మి ఒక కుటుంబ సభ్యురాలిగా దగ్గరైపోయింది. దాని హుందాతనం, దాని కలివిడి తనం, పిల్లలు పెద్దలూ అన్న తేడా లేకుండా దగ్గరకు వచ్చిన వారందరినీ తొండంతో దీవెనలు అందచేసే మంచితనంతో ఆలాలగోపాలాన్నీ ఆకట్టుకుంది.
దీంతో లక్ష్మి మరణ వార్త భక్తులను కలచి వేసింది. లక్ష్మిని కడసారి చూసేందుకు వచ్చిన వారిలో భక్తులూ కాదు.. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rushed-for-the-last-glimpse-of-elephant-lakshmi-25-148002.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.