Publish Date:Dec 23, 2024
తెలంగాణ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి తరలనుందన్న చర్చ మరో సారి మొదలైంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ హీరోలను టార్గెట్ చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. దీంతో అప్పటి నుంచే రాష్ట్రం విడిపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడం ఖాయమన్న చర్చ అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.
Publish Date:Dec 23, 2024
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్ సమాజానికి చీడపురుగుగా అభివర్ణించారు. జగన్ ను మరో సారి అధికారంలోనికి రానీయకూడదని పదే పదే ప్రజలకు పిలుపు నిచ్చారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారానికి దూరమైంది.
Publish Date:Dec 22, 2024
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి జేపీసీకి పంపింది. ఈ జమిలీ ఎన్నికల బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప జేసుకోగలదా అన్న సంశయం బీజేపీ నేతలతో సహా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలంటే సభలో మూడింట రెండోంతుల మంది మద్దతు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సభలో ఆ బలం లేదు. అయితే ప్రధాని మోడీ ఏ ధైర్యంతో ముందుకు వెడుతున్నారన్న సందేహం బీజేపీయేతర పార్టీలలో బలంగా వ్యక్తం అవుతోంది.
Publish Date:Dec 22, 2024
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్, బీజేపీ మధ్య అగాధం ఇంకా పూడలేదన్న సంకేతాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. తాజాగా మోహన్ భగవత్ మసీదు, మందిరం వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవచించడం బీజేపీ,సంఘ్ పరివార్ మధ్య సంబంధాలు ఇంకా బలపడలేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Dec 22, 2024
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చినికిచినికి గాలివానలా మారి పెనుదుమారాన్ని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు టాలీవుడ్‌నూ షేక్ చేస్తుంది. ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వ్యవహారం మారింది. పనిలో పనిగా అర్జున్ లీగల్ టీం పోలీసులను సైతం రెచ్చగొట్టడంతో ఇంకాస్త ముదిరింది. తొక్కిసలాట ఘటనలో ప్రధాన ముద్దాయిగా అల్లు అర్జున్ ను ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ప్రొజెక్ట్ చేస్తుండగా.. తన తప్పేమీ లేదంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.
Publish Date:Dec 21, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Dec 21, 2024
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీఇన్నీకావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును జగన్ మోహన్ రెడ్డి అప్పనంగా తన అనుచర గణానికి, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు.
Publish Date:Dec 21, 2024
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. జగన్ వెంట ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
Publish Date:Dec 21, 2024
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అగ్రహం చేసిన కొద్దిసేపట్లో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు.
Publish Date:Dec 21, 2024
సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Publish Date:Dec 20, 2024
భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే.. భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు.
Publish Date:Dec 20, 2024
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం(డిసెంబర్ 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
Publish Date:Dec 20, 2024
మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ ఫార్ములా కార్ రేసు కేసు విషయంలో న్యాయపరమైన చిక్కులు తప్పవన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండటం కోసం, పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు సొమ్ము ఇవ్వాల్సి వచ్చిందన్న కేటీఆర్ వివరణ న్యాయ పరీక్షకు నిలబడే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.