Publish Date:Apr 21, 2025
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు.. వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ ఎప్పుడు ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా.. రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ దాచుకోలేదు.
Publish Date:Apr 21, 2025
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 21, 2025
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో నగదు లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.
Publish Date:Apr 21, 2025
ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు.
Publish Date:Apr 21, 2025
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు.
Publish Date:Apr 21, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.
Publish Date:Apr 21, 2025
500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Apr 21, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు.
Publish Date:Apr 21, 2025
పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో మాధవ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు.
Publish Date:Apr 21, 2025
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొన్నాది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
Publish Date:Apr 21, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.
Publish Date:Apr 21, 2025
బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Publish Date:Apr 21, 2025
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.
వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జనసేనలు వ్యతిరేకించాయి.