Publish Date:Mar 23, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మార్చి 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం (మార్చి 23) శ్రీవారిని 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 19 వేల 064 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానులక ఆదాయం 4 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-194870.html
అబుదాబీలోని బాప్స్ స్వామినారాయణ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు.
తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది.
వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉ:ది. సోమవారం (ఏప్రిల్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.