డిప్యూటీ సీఎంగా లోకేశ్‌.. లైన్ క్లియ‌రైందా?

Publish Date:Jan 19, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్న ఈ డిమాండ్ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీకి మూడో త‌రం వార‌సుడిగా.. రాబోయే కాలంలో పార్టీని న‌డిపించే నాయ‌కుడిగా లోకేశ్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా న‌మ్ముతోంది. దీనికి కార‌ణం  లోకేశ్ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితిని క‌న‌బ‌ర్చ‌డ‌మే. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురెళ్లి లోకేశ్ స‌వాల్ చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లోకేశ్ దూకుడు కార‌ణంగానే జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు భ‌య‌ప‌డి మూడేళ్లు బ‌య‌ట‌కురాని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం ఒక్క‌సారిగా రోడ్లెక్కి అప్ప‌టి ప్ర‌భుత్వంపై పోరు బాట‌ ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం ప‌డిన‌ట్ల‌యింది.

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న ప‌రిధిలోఉన్న శాఖ‌ల్లో కీల‌క మార్పులు తీసుకువ‌స్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌దైన మార్క్ ను చూపిస్తున్నారు. అన్నివిధాలా లోకేశ్ త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవ‌టంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, తెలుగుదేశం క్యాడ‌ర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. కానీ, తెలుగుదేశం ముఖ్య‌నేత‌లతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కూట‌మి నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉండేవారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు.. అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒక‌రు, అంత‌కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి అంటే రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికాక‌పోయిన ఆ స్థానంలో ఉన్న‌వారు ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తూనే.. ఇత‌ర శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్స్ ఎక్కువ అనే చెప్పొచ్చు. దీంతో కూట‌మిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి  నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది.  మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల కేవ‌లం కొంత‌మేర మాత్ర‌మే లోకేశ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాగ‌లుగుతున్నారనీ, ఉప‌ముఖ్య‌మంత్రి హోదా ఉంటే పాల‌న‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించి, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా లోకేష్ కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. 

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న డిమాండ్ ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నేత‌లు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ ను అవ‌కాశంగా తీసుకొని కూట‌మిలో విబేధాలు త‌లెత్తేలా చేయాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లమంటూ టీడీపీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌టం విశేషం. అయితే, లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌న్న డిమాండ్ పై జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా ఈ అంశంపై  స్పందించ‌లేదు. కానీ, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువ‌వుతుండ‌టంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

By
en-us Political News

  
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీపగబట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరనుందని అన్నారు. తమకు అధికారం దక్కని దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ కోపం పెంచుకుని వివక్ష చూపుతోందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమెళి, రాజాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (మార్చి 13) సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో నాగం మంత్రిగా పని చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీలోని సీనియర్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారనేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒక్క కాంగ్రెస్ అనేమిటి ఈ సీనియర్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారని దుయ్యబట్టారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉంది రక్షణ కల్పించండంటూ కడప ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ మేరకు ఎస్పీకి లేఖ ఇచ్చాడు. గతంలో తనకు ఇచ్చిన భద్రతను పునరుద్ధరించాలని ఆ లేఖలో కోరాడు.
ఇంట్లో మగాళ్లు తాగుతుంటే మహిళలు గగ్గోలు పెడుతుండటం చూస్తూనే ఉంటాం. మందుబాబుల వీరంగాలతో గృహహింస కేసులు కామన్‌గా మారిపోతున్నాయి. అయితే అక్కడ మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌లో కనిపిస్తున్నది. ఆ గ్రామంలో మహిళలు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని అదే గ్రామానికి చెందిన పురుషులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 తెలంగాణలో వరుసగా లిప్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లిప్ట్ గోడ మధ్యలో చిక్కుకుని  ఓ బాలుడు మృతి చెందాడు. జగిత్యాలలో సిరిసిల్లా 17వ బెటాలియన్  కమాండెంట్ గంగారాం (59)లిప్ట్ లో ఇరుక్కుని చనిపోయాడు.
గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.