దేశ సమగ్రతే జనసేన ఆత్మ : డిప్యూటీ సీఎం పవన్

Publish Date:Jun 15, 2026

Advertisement

 

దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై రాజీ లేకుండా పోరాడతామని, దేశ ప్రయోజనాలే పార్టీకి తొలి ప్రాధాన్యమని తెలిపారు.

ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికారం లేదా పదవుల కోసం కాకుండా దేశ సమగ్రతను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైందన్నారు. “దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్” అనేది జనసేన విధానమని స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ త్యాగాలకు, స్వాతంత్ర్య పోరాటాలకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, ప్రతి భారతీయుడి కలలు ఢిల్లీతో ముడిపడి ఉన్నాయని అన్నారు. దేశాన్ని విభజించే భావజాలాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే శక్తులను జనసేన ఎప్పటికీ ఉపేక్షించదని హెచ్చరించారు.

జనసేన సిద్ధాంతాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా పార్టీ భావజాలానికి ఆదరణ లభిస్తోందని తెలిపారు. భిన్న ప్రాంతాలను, భిన్న వర్గాలను దేశభక్తి అనే ఒకే తాటిపైకి తీసుకురావడమే జనసేన లక్ష్యమన్నారు.

తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తీరును మాత్రమే ప్రశ్నించామని చెప్పారు. విభజన ప్రక్రియలో జరిగిన లోపాల వల్లే ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

దేశానికి హాని చేసే శక్తులు ఎంత చిన్నవైనా వాటిని తేలికగా తీసుకోవద్దని పేర్కొన్న పవన్ కళ్యాణ్, దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రతి చర్యను జనసేన బలంగా అడ్డుకుంటుందని అన్నారు. దేశ విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిపై పార్టీ గళం ఎప్పుడూ బలంగానే ఉంటుందన్నారు.

పార్లమెంట్‌లో జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు ప్రత్యేక బాధ్యత ఉందని, కేవలం నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ అంశాలపై కూడా గళం వినిపించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ ప్రయోజనాల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

జెన్-జీ తరానికి దేశభక్తి, రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు, నీతివంతమైన పాలన ఎలా ఉండాలో జనసేన చూపిస్తుందని, దేశానికి బలమైన పునాదులు వేయడమే పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.