ఫినిష్ చేసేస్తారా? ప్రజాస్వామ్యమా? అరాచకమా?

Publish Date:May 30, 2023

Advertisement

ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది... అలాంటి వేళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం   అమదాలవలసలో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే ఆయన ఫినిష్ అయిపోతారని, వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన  మాట్లాడుతున్నారంటూ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు ఎవరిని ఉద్దరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత అంటూ ప్రశ్నించారు. ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఉపసంహరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కూడా తమ్మినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి  తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడడం... దేనికి సంకేతమని ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటువంటి వ్యాఖ్యలు జగన్ పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు.. అంటే మాజీ మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ప్రస్తుత మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా లాంటి వాళ్లు చేస్తే.. రోటిన్ అనుకోవచ్చు. కానీ తమ్మినేని సీతారాం చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకోవైపు వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలూ, శ్రేణులే అంగీకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు.. వెళ్తున్నారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. అలాగే గతే ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడు సక్సెస్ అయిందని. అదేవిధంగా ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా తాజాగా నిర్వహించిన మహానాడు సైతం సూపర్ డూపర్‌ సక్సెస్ అయింది. తెలుగుదేశం కార్యక్రమాలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.  

ఇక గతంలో చంద్రబాబు నివాసంపైకి మంది మార్బలంతో అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వెళ్లడం.. అలాగే జగ్గయ్యపేట పర్యటనలో ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగడం... ఆ సమయంలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు కావడం.. ఒక కమెండోకు నిజమైన కుట్లు పడటం తెలిసిందేప. ఇక కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబును అడ్డగించడం.. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అలాగే గతేడాది డిసెంబర్ చివరలో చంద్రబాబు రోడ్డు షో సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది విగత జీవులు కాగా. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే గుంటురులో చంద్రన్న కానుక పంపిణి సందర్బంగా జరిగిన తోపులాటలో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ (1) తీసుకు వచ్చింది. సదరు జీవోపై ప్రతిపక్షాలను అణగదొక్కేందుకేనంటూ విపక్షాలు సైతం నిరసన వ్యక్తం చేశాయి.ఆ జీవోను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.  

గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపైన.. అలాగే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపైన అధికార పార్టీ శ్రేణులు దాడి చేస్తుంటే...రక్షక భట వర్గం ప్రేక్షక పాత్ర వహించడం వినా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం. రాష్ట్రంలో నెలకొన్న అరాచకత్వానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతోన్నాయి. అందుకు పార్టీ అధికార ప్రతినిధి కె. పట్టాబి అంశమే ఓ ఉదాహరణగా ,చెప్పవచ్చు.  

మరోవైపు అధికారం అందుకోవడం కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై ఎయిర్ పోర్ట్ వేదికగా కోడికత్తి దాడి ఎపిసోడ్ చోటుచేసుకోవడం... అలాగే వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్య కావింప బడడం.. సదరు కేసులన్నీ కాలం గడుస్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతి లో భద్రంగానే ఉన్నాయని వారు వివరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలకు పోలీసులు సాక్షీభూతంగా నిలుస్తున్నారు.. తప్ప వాటిని నియంత్రించే పనిని వారు చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు చంద్రబాబు భద్రతపై ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయనీ, అటువంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనికి ఒక్క క్షణం కూడా స్పీకర్ గా కొనసాగే అర్హత లేదనీ తెలుగుదేశం శ్రేణులే కాదు, రాజకీయ పండితులు, న్యాయ నిపుణులు సైతం అంటున్నారు. 

By
en-us Political News

  
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.