పింగళికి భారత రత్న.. కుటుంబం అభ్యర్ధన
Publish Date:Jul 31, 2022
Advertisement
దేశంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌కి తోచినవన్నీ అమలు చేయా లన్న ఆకాంక్ష మరీ ఎక్కువవుతోంది. దేశభక్తి కేవలం బీజేపీవారికే స్వంతం అన్న భావనలో కమలనాథులు వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయో ధులన్నా, జాతీయ పతాకం అన్నా దేశంలో ప్రతీ పౌరుడికీ గౌరవాభిమానాలు ఉంటాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుంటూరులోని కేఎల్ డీమ్డ్ యూని వర్సిటిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఆగస్టు 13 నుంచి 15 వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని శెలవిచ్చారు. ఈ భక్తి ప్రపత్తులు పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకి భారత రత్న వచ్చేట్టు చేయడంలో ప్రదర్శించాలని గుంటూరువాసుల అభిప్రాయం. కేవలం ఆయన కుటుంబసభ్యులను కలిసి వారిని ఢిల్లీకి ఆహ్వానించేకంటే ఆయన 146 జయంతి సందర్భంగానూ భారత రత్న విషయంలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుందనేది విశ్లేష కుల మాట. ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. పింగళి కుటుంబసభ్యులను ఆహ్వానించామని, ప్రధాని మోదీ వారిని సత్కరిస్తారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పింగళి స్మారకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తారని అన్నారు. ఈ సంద ర్భంగా పింగళి మనుమరాలు సుశీలను కిషన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. పింగళికి భారతరత్న ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, రోడ్ల పరిస్థితిపై గ్రామస్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు. భట్లపెనుమర్రులో మౌలిక వసతుల కల్పనకు, తారు రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆర్డీవో విజయ్‌కుమార్‌ను కిషన్‌రెడ్డి ఆదేశించారు. రోడ్డునిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే ప్రధానితో మాట్లాడి తామే చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అంతకుముందు జాతీయ జెండాచేతపట్టి గ్రామస్థులతో పెద్దఎత్తున ఊరేగింపుగా వెళ్లి పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు.
http://www.teluguone.com/news/content/demand-for--bharatratna-to-pingali-39-140962.html





