Publish Date:Jul 31, 2022
దేశంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌కి తోచినవన్నీ అమలు చేయా లన్న ఆకాంక్ష మరీ ఎక్కువవుతోంది. దేశభక్తి కేవలం బీజేపీవారికే స్వంతం అన్న భావనలో కమలనాథులు వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయో ధులన్నా, జాతీయ పతాకం అన్నా దేశంలో ప్రతీ పౌరుడికీ గౌరవాభిమానాలు ఉంటాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుంటూరులోని కేఎల్ డీమ్డ్ యూని వర్సిటిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఆగస్టు 13 నుంచి 15 వరకూ ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని శెలవిచ్చారు. ఈ భక్తి ప్రపత్తులు పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకి భారత రత్న వచ్చేట్టు చేయడంలో ప్రదర్శించాలని గుంటూరువాసుల అభిప్రాయం. కేవలం ఆయన కుటుంబసభ్యులను కలిసి వారిని ఢిల్లీకి ఆహ్వానించేకంటే ఆయన 146 జయంతి సందర్భంగానూ భారత రత్న విషయంలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుందనేది విశ్లేష కుల మాట.
ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. పింగళి కుటుంబసభ్యులను ఆహ్వానించామని, ప్రధాని మోదీ వారిని సత్కరిస్తారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పింగళి స్మారకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తారని అన్నారు. ఈ సంద ర్భంగా పింగళి మనుమరాలు సుశీలను కిషన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. పింగళికి భారతరత్న ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, రోడ్ల పరిస్థితిపై గ్రామస్థులు మంత్రికి ఫిర్యాదు చేశారు. భట్లపెనుమర్రులో మౌలిక వసతుల కల్పనకు, తారు రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆర్డీవో విజయ్‌కుమార్‌ను కిషన్‌రెడ్డి ఆదేశించారు. రోడ్డునిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోతే ప్రధానితో మాట్లాడి తామే చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అంతకుముందు జాతీయ జెండాచేతపట్టి గ్రామస్థులతో పెద్దఎత్తున ఊరేగింపుగా వెళ్లి పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/demand-for--bharatratna-to-pingali-39-140962.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.