డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే ఎక్కువ

Publish Date:Sep 22, 2023

Advertisement

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు  ఆమోద ముద్ర వేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు, మేథావులు మహిళా రిజర్వేషన్   చట్టం అమలుకు, జనగణన, డీలిమిటేషన్ (అసెంబ్లీ,లోక్ సభ,నియోజక వర్గాల పునర్విభజన)తో  ముడిపెట్టి,  ఏకంగా ఐదేళ్ళు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే  ఆ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది పక్కన పెడితే, ఇప్పడు కొత్తగా డీలిమిటేషన్ పై  రాజకీయ వివాదం తెరపై కొస్తోంది. ముఖ్యంగా లోక్ సభ నియోజక వర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది.   మరీ ముఖ్యంగా, రాష్ట్ర విభజ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తక్షణమే నియోజక వర్గాల పునర్విభజన జరగాలని అప్పటి నుంచి కోరుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు జనభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే,ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరుగుతుందని విమర్శిస్తూ ఉమ్మడి పోటానికి పిలుపు నిస్తోంది.  

ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు మరింతగా  నష్ట పోతాయని,  దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్టాల ప్రజలు దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ (రెండవ తరగతి పౌరులు) గా అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే  రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు. 

కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్ సభలో  వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 44 లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య, 36 తగ్గుతుందని అంటే, తెలుగు రాష్ట్రాలు ఎనిమిది శానాలు కోల్పోతాయని, దీంతో పార్లమెంట్ లో తెలుగు గళం బలహీనపడుతుందనిఅంటున్నారు.  అలాగే, కేరళ,(8) తమిళనాడు,(8) కర్ణాటక (2) పశ్చిమ బెంగాల్ (4) ఇలా  దక్షిణాది రాష్ట్రాలలో నియోజక వర్గాల  సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మరో వంక ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిన కారణంగా చాలా వరకు రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.  ఒక్క  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతమున్న 80 నియోజక వర్గాల సంఖ్య 11 పెరిగి 91 చేరుకుంటుంది. 

నిజానికి  డీలిమిటేషన్  తర్వాత నియోజక వర్గాల సంఖ్య అన్ని రాష్ట్రాలలో  పెరగాలి కానీ, డీలిమిటేషన్ కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వలన జనాభా నియత్రణ పాటించిన ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. జనాభా నియంత్రణ పాటించడంతో పాటుగా జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు   స్థూల జాతీయ ఉత్పత్తికి 35 శాతం నిధులు అందిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని అంటున్నారు.కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నదని నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఇసుమంతైనా స్టేక్ లేని దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం, అదే సమయంలో తమ బలం ఎక్కువగా ఉన్నచోట మరిన్ని సీట్లు పెంచి తద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

అయితే, ఇంకా ఇప్పటి వరకు డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరగ  లేదు. అంతకు ముందు జరగ వలసిన జనగణన ఇంత వరకు మొదలు కాలేదు.. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకే .. మరో సంవత్సరకాలం  పడుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే, మరో మూడేళ్ళ తరవాత 2026- 27 నాటికి కానీ  ఈ ప్రక్రియ పూర్తి కాదు .. ఈ లోగా ఏమైనా  జరగ వచ్చును. అయితే కేంద్రం ప్రతిపాదించిన జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మాత్రం కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచి, వారి గళం లోక్ సభలో, రాజ్యసభలో వినపడకుండా చేయాలన్న దురుద్దేశంతో చేసిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.