ఇండియాలో రీప్యాకింగ్ దందా.. అమెరికా, దుబాయ్ నుంచి ఎక్స్ పైర్ అయిన సరుకు.!

Publish Date:Jul 17, 2026

Advertisement

మార్కెట్లో లభించే విదేశీ బ్రాండ్ల చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ విషయంలో జరుగుతున్న భారీ నకిలీ దందా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.  అమెరికా, దుబాయ్ వంటి దేశాల నుండి గడువు ముగిసిన (ఎక్స్ పైర్ అయిన) ఆహార పదార్థాలను తక్కువ ధరకు తెప్పించి, వాటిపై కొత్త తయారీ తేదీలను ముద్రించి మార్కెట్లో విక్రయిస్తున్న  ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠాకు సూత్రధారి అయిన 54 ఏళ్ల అటల్ జైస్వాల్ తో పాటు అతని ఆరుగురు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇండియాలో  ఇంపోర్టెడ్ ఫుడ్ వ్యాపారం పేరిట వీరు ఈ భారీ మోసానికి తెరలేపారు.  పోలీసుల కథనం ప్రకారం..  అటల్ జైస్వాల్,  అతని గ్యాంగ్ అమెరికా, దుబాయ్ లలోని కొన్ని ఏజెన్సీలతో చేతులు కలిపి . అక్కడ ఎక్స్ పైరీ డేట్ ముగిసిన  అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిపై కొత్త ఎక్స్ పైరీ డేట్లు ముద్రించి విక్రయించేవారు. 

ప్రధానంగా ఓరియో బిస్కెట్లు, కేకులు, కోకోకోలా వంటి విదేశీ పానియాలు, అలాగే విదేశీ బ్రండ్ల చాక్లెట్లు, స్నాక్స్ ను కంటైనర్ల ద్వారా ఇండియాకు రప్పించి, వాటి ఎక్స్ పైరీ డేట్ తేదీలను మార్చి మార్కెట్లోకి పంపేవారు. ఈ ముఠ.. తమ రహస్య గోడౌన్లలో  గడువు ముగిసిన తేదీలను కెమికల్స్ ఉపయోగించి పూర్తిగా చెరిపేసేవారు. ఆపై అత్యాధునిక ప్రింటింగ్ మిషన్ల ద్వారా ఆ ప్యాకెట్లపై   త్త ఎక్స్‌పైరీ తేదీలను, మ్యానుఫ్యాక్చరింగ్ తేదీలను ముద్రించేవారు. ఇలా రీ ప్యాకింగ్ చేసిన నకిలీ, ఆరోగ్యానికి హానికరమైన విదేశీ ఆహార పదార్థాలను దేశంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్లు, విదేశీ వస్తువులు అమ్మే ప్రీమియం షాపులకు విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వీరి గోడౌన్ల పై మెరుపు దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో లక్షలాది రూపాయల విలువైన గడువు ముగిసిన ఓరియో బిస్కెట్లు, విదేశీ కోకాకోలా బాటిళ్లు, చాక్లెట్లతో పాటు డేట్లు మార్చేందుకు ఉపయోగించే కెమికల్స్, ప్రింటింగ్ డైలు, ప్యాకేజింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. 

  Imported food scam, Expired food racket, Atal Jaiswal arrest, Fake expiry date scam, Re-packaging fraud

By
en-us Political News

  
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బులియన్ మార్కెట్లో బంగారం వెండి నిష్పత్తి 69 కి చేరింది. 2026 లో 80 మార్కు దాటిన ఈ రేషియో ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో ఏ లోహంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి భవిష్యత్ పెట్టుబడులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంగారం, ఆయిల్ కంటే నీటి హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.
అమెరికాలో ఓటింగ్ విధానాన్ని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act 2026 బిల్లు విశేషాలు, పౌరసత్వ నిరూపణ నిబంధనలు మరియు దీనివల్ల ఓటర్లపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? జూలై 19న లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్‌లో చివరిదా? అసలు నిజమేంటో ఇక్కడ చదవండి.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌ను ప్రశ్నిస్తూ, వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు స్మృతి మందానను కెప్టెన్ చేయాలని సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.