అవినాష్ అరెస్ట్‌.. ఢిల్లీ నుంచి ఆదేశాలు!

Publish Date:May 19, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ   అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనీ, ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న  అవినాష్ రెడ్డి.. గురువారం సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారని.. ఆ క్రమంలో ఆయన తల్లికి గుండెపోటు వచ్చిందని.. పులివెందుల ఆసుపత్రిలో ఆమె చేరారంటూ.. సీబీఐకి ఆయన లేఖ పంపడం.. ఆ లేఖను సీబీఐ తోసిపుచ్చి.. అవినాష్ కోసం సీబీఐ పయనం కావడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అరెస్ట్‌ పక్కా అని స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదీకాక  అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరైన తొలిసారి నుంచి అంటే 2023, జనవరి 28వ తేదీ నుంచి.. ఆయయను అరెస్టు భయం వెంటాడుతూనే ఉందని అంటున్నారు.  తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైయస్ అవినాష్ రెడ్డి వెంట.. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు   శ్రీకాంత్ రెడ్డి, కె. శ్రీనివాసులతోపాటు భారీగా ఆయన  అనుచరగణం కూడా హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలి  రావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.

మరోవైపు అదే రోజు... సీబీఐ విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు  అవినాష్ రెడ్డి.. లోటస్ పాండ్‌లోని  వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు, సీఎం  జగన్ రెడ్డి  తల్లి   విజయమ్మతో  భేటీ అయ్యారు.  ఆమె ఆశీర్వాదం తీసుకొనేందుకు వెళ్లానని  అవినాష్ రెడ్డి పైకి చెబుతున్నప్పటికీ..ఈ వీరిద్దరి భేటీలో బలమైన చర్చ జరిగిందనే ఓ టాక్ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నేటికి వాడి వేడిగా సాగుతోంది. అంతే కాదు సీబీఐ విచారణ విడతల వారీగా జరుగుతోండగా... తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కోసం వైయస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం పట్ల జిల్లా వాసులు నేటికీ విస్మయం వ్యక్తం  చేస్తున్నారు.

ఇంకోవైపు వైయస్ వివేకా చనిపోతూ రాసిన లేఖగా చెప్పబడుతోన్నలేఖ విషయంలో తన ఆరోపణలను పట్టించుకోకుండా సీబీఐ విచారణ జరపడాన్ని అవినాష్ మీడియా ఎదుట చెప్పడం,  అలాగే   వివేకా.. రెండో వివాహం.. ఆయన రెండో భార్య కుమారుడికి రాజకీయ వారసత్వం అంటూ మీడియా ముందుకు వచ్చి.. మరణించిన వివేకా క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసేలా మాట్లాడడం,  అదే విధంగా  అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి సైతం  వివేకా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలతో కోర్టులో పిటిషన్ వేయడం పట్ల కడప జిల్లాలో సందేహాలే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తమైందని చెబుతున్నారు. ఇక మే 16వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా.. తనకు  పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో తనకు నాలుగు రోజుల గడువు కావాలని కోరడం పట్ల జిల్లా ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఏపీ సీఎం జగన్ మరికొద్ది రోజుల్లో  నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దేశ రాజదాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతీసారి.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతోన్న విషయం విధితమే. అలాంటింది ఈసారి ముఖ్యమంత్రి వైయస్ జగన్ .. హాజరుకానుండడం పట్ల... ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుమానం   వ్యక్తం చేస్తున్నారు.  

గతంలో   అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం సాగుతోన్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి.. ప్రధాని, హోం శాఖ మంత్రితో భేటీ కావడం... ఆ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిపోవడం.. వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయని.. అలాంటి పరిణామాలు మళ్లీ వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పునారవృతమ్యే అవకాశాలు లేక పోలేదనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది. ఏదీ ఏమైనా.. ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నట్లుగా  అవినాష్ రెడ్డి వ్యవహారశైలి ఉందనే చర్చ సైతం వాడి వేడిగా కొన...సాగుతోంది. ఏది ఏమైనా నేడో రేపో లేకపోతే ఆ మరునాడో అవినాష్ అరెస్ట్ తధ్యమన్న భావన అయితే అందరిలో వ్యక్తమౌతోంది.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.