ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా ఎర్రచందనం స్వాధీనం..!

Publish Date:Jul 16, 2026

Advertisement

 

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. హాంకాంగ్‌కు అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 365.545 కిలోల ఎర్రచందనం (రెడ్ శాండర్స్) స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో జూలై 13, 2026న టెర్మినల్-3లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హాంకాంగ్‌కు సీఎక్స్-698 విమానంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అతడిని అడ్డుకుని సామానును క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో మొత్తం 12 బ్యాగుల్లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టిన 365.545 కిలోల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఆరు ట్రాలీ సూట్‌కేసులు, మరో ఆరు ట్రావెల్ బ్యాగులు ఉన్నాయి.

అధికారులకు అనుమానం రాకుండా ఎర్రచందనం దుంగలను నీలిరంగు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి, వాటి చుట్టూ మందమైన స్పాంజ్ అమర్చి స్కానింగ్‌లో కూడా గుర్తించలేని విధంగా దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించినదై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఎర్రచందనాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? హాంకాంగ్‌లో ఎవరికి అప్పగించాల్సి ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర వ్యక్తుల పాత్రపైనా విచారణ చేపట్టారు.

ఈ అక్రమ ఎగుమతి ప్రయత్నం కస్టమ్స్ చట్టం–1962, సైట్స్ (CITES) కన్వెన్షన్ అపెండిక్స్-II, అలాగే విదేశీ వాణిజ్య (అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1992 నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని కస్టమ్స్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత విలువైన వనరుగా భావించే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Delhi IGI Airport, Red Sanders, Red Sandalwood Smuggling, Customs Seizure,  365.545 Kg Seized, Hong Kong, Indian Passenger Arrested, Air Intelligence Unit (AIU), International Smuggling, Customs Raid

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు.
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.