ఢిల్లీలో హైటెన్షన్: జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు.!

Publish Date:Oct 9, 2026

Advertisement

దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాజధానిలో అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని సీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే సరైన సమయానికి దరఖాస్తు చేసుకోలేదన్న కారణంతో పోలీసులు ఈ ఆందోళనకు పర్మిషన్ ఇవ్వలేదు.

అనుమతి లేనప్పటికీ వెనక్కి తగ్గేది లేదని నిర్వాహకులు స్పష్టం చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర బలగాలతో కలిసి సుమారు 20,000 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది, ఏడు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా ఉంచారు.ఈ అసాధారణ భద్రతా చర్యల కారణంగా మధ్య దిల్లీ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే అనేక మెట్రో స్టేషన్లలో ప్రవేశాలను నిలిపివేయడంతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పొరుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చే మార్గాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థపై ఈ స్థాయిలో ఆంక్షలు విధించడం సరికాదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్య నిరసనలను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఆంక్షలు, ప్రజా సంఘాల ప్రతిఘటనల మధ్య రానున్న కాలంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

 

 

[ Delhi High Alert,  Cockroach Janata Party, Gyanesh Kumar, Jantar Mantar Security, Election Commission, CJP Protest, Delhi Security Alert, Jantar Mantar Protest, 46 Metro Stations Closed ]


 

By
en-us Political News

  
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.