జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జయభేరి.. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం

Publish Date:May 1, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శనతో  చరిత్ర సృష్టించింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం (మే 1) జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్ఆర్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఏకంగా 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, ఫ్రాంచైజీ చరిత్రలోనే   అత్యధిక  ఛేదన చేసి రికార్డు సృష్టించింది. 

రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక   పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి కెప్టెన్ కేఎల్ రాహుల్   చక్కని సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 9.3 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బలమైన పునాది వేశారు.

నిస్సంక  62 పరుగులు చేసి నిష్క్రమించినా ఢిల్లీ  ఎక్కడా తడబడలేదు.  వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్ రాణా  కేవలం 16 బంతుల్లోనే  33 పరుగులతో మెరుపులు మెరిపించాడు.  రాహుల్ తన అనుభవాన్ని జోడించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18,  అశుతోష్ శర్మ పాతిక పరుగులతో మ్యాచ్ ను ముగించారు.  దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డొనోవన్ ఫెరీరా  47 నాటౌట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోరును 200 దాటించాడు. అయితే..  ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ (3/40) కీలక సమయాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ స్కోరును కొంత మేర నియంత్రించగలిగాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, ఇతర జట్లకు బలమైన హెచ్చరిక పంపింది.    

By
en-us Political News

  
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా  ప్రజల ఫోన్లకు శనివారం  అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.