ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఇంకా సమాయత్తమైనట్లు కనిపించడం లేదు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటూ ఆప్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయన్న విషయాన్ని తేటతెల్లం చేసేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ పరిస్థితి ఆటలో అరటిపండులా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.
గత దశాబ్దంగా ఢిల్లీ పీఠం అప్ చేతిలోనే ఉంది. దీంతో బీజేపీ ఆప్ లక్ష్యంగా వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగా తన ప్రచార ప్రణాళికను రచించుకుంటోంది. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విషయంలో పూర్తిగా మోడీ కరిష్మాపైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు. హిందుత్వ అజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడం, అలాగే ఆప్ అవినీతి పార్టీ అంటూ చాటడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆప్ యమున ప్రక్షాళనకు వ్యతిరేకం అంటూ ఉద్ఘాటించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు అరెస్టైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే ప్రధాని మోడీ తన ప్రచార శంఖారావాన్ని పూరించారు.
ప్రధాని మోడీ శుక్రవారం (జనవరి 3)న ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన గృహాలను పేదలకు పంపిణీ చేయడం కోసం చేసిన ఈ పర్యటనను ఆయన ఎన్నికల ప్రచారం కోసం పూర్తిగా వాడుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందనీ, స్వయంగా ఆ పార్టీ అగ్రనేతలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ వ్యాపారి ఇచ్చిన పది లక్షల రూపాయల విలువైన సూటు ధరించారనీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ప్రధాని తన నివాసాన్ని నిర్మించుకున్నారనీ ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలు, ప్రతి విమర్శలతో శీతాకాలంలో వణికించే చలిలో కూడా ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ రాజకీయ వేదికపై కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్ర, పోటీ నామమాత్రంగానే ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-assembly-elections-where-is-congress-39-190803.html
ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ హజరైవెనుదిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉదయం ఎసిబి ఆఫీసు గేటు ముందు వరకు వెళ్లిన కెటీఆర్ ఎసిబి ఆఫీసులోకి ఎంటర్ కాలేదు.
ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ,కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మధ్య విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య ధనశ్రీతో దిగిన ఫోటోలను యజువేంద్ర డిలీట్ చేశాడు.
గత కొంత కాలంగా ఛత్తీస్ గఢ్ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్ తో మావోయిస్టుల కంచుకోట బద్దలౌతున్నది.
సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడైన , నటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నట్లు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారమందింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు.
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ ఇప్పటికే ఏర్పాట్లను సమీక్షించారు. మధ్యాహ్నం ద్రవిడ యూనివర్శిటీ చేరుకుని ఆడిటోరియంలో కుప్పం 2029 విజన్ ఆవిష్కరించారు
నటుడు మంచు మోహన్ బాబు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది.
దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.
చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు. శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది.
తెలంగాణ మాజీ మంత్రి కెటీఆర్ సోమవారం ఎసిబి ఆఫీసుకు హాజరయ్యారు. కెటీఆర్ రాక సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడలాడిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రతతో విరుచుకుపడుతున్న మంచు తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోయింది.