మాజీ సీఎంకు సీఎం పరామర్శ.. కేసీఆర్ కు రేవంత్ కు ఇదే తేడా!

Publish Date:Dec 10, 2023

Advertisement

శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం రేవంత్ పరామర్శించారు. మామూలుగా అయితే ఇదేమంత చెప్పుకోవలసిన.. కాదు కాదు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం కాదు. కానీ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలలో ఇటువంటి వాతావరణంలేదు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరం, యుద్ధం అన్నట్లుగానే పరిస్థితులు కనిపించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. విపక్షాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి గంపగుత్తగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోని వలస వచ్చేలా చేశారు. అలా రాని వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎంగా ఉన్న సమయంలో పలు అవమానాలకు గురి చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను ట్రాప్ చేసి మరీ జైలుకు పంపారు. 

 రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ నేతలను, వారి పార్టీని, అధిష్టానాన్ని, చివరికి దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి కూడా కేసీఆర్ ఇష్టారీతిన విమర్శలు గుప్పించారు.   రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీకి రానీయకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయనను సభ నుంచి బహిష్కరింపజేసేవారు. సుదీర్ఘ  రాజకీయ అనుభవం  ఉన్న కేసీఆర్‌ ఇలా వ్యవహరిస్తే..  ఆయన ఎంతగా అవమానించినా, రాజకీయంగా   దెబ్బ తీసినా, గెలిచిన తరువాత   ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్‌ రెడ్డి వ్యవహరించిన తీరు రాజకీయ పరిణితిని నిదర్శనంగా నిలుస్తోంది. గెలిచిన తరువాత ఆయన కేసీఆర్ పై కానీ, బీఆర్ఎస్ పై కానీ ఒక్క రాజకీయ విమర్శ చేయలేదు. అధికారంలో ఉండగా కేసీఆర్ చేసిన విధంగా రేవంత్ ఎక్కడా కేసీఆర్ ను ఎద్దేవా చేయలేదు. పరుషంగా మాట్లాడలేదు.    యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను స్వయంగా పరామర్శిచారు. సహచర మంత్రులు సీతక్క, జూపల్లిలతో కలిసి ఆయన యశోదా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అవసరమైనా అందిస్తామన్నారు. కేసీఆర్ బాత్ రూంలో జారి పడిన రోజున ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిన తర్వాత ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిని ఆస్పత్రికి పంపి ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పరామర్శించారు.

రేవంత్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలలో హుందాగా ఉండటం ఎలాగో కేసీఆర్ కు ఇప్పుడు అవగతమై ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ ను, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ను కనీసం అభినందించి, శుభాకాంక్షలు కూడా తెలియజేయని కేసీఆర్ ను  రేవంత్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి  మరీ  పరామర్శించడం ద్వారా వ్యక్తిత్వం విషయంలో ఇరువురి మధ్యా ఉన్న తేడా ఏమిటన్నది ప్రజలను స్పష్టంగా తెలిసిందని పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.