రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్

Publish Date:Oct 16, 2025

Advertisement

ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్‌ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యూఎస్‌కు చెందిన రక్షణ రహస్యాలను కలిగిఉండటంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు  ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ  నేపథ్యంలోనే అమెరికా   అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.  

విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్‌ ను  ప్రస్తుతం ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారని  వర్జినియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.  ఇక ఆయన  నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆష్లే టెల్లీస్‌ వద్ద రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉంచుకోవడం ద్వారా  నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.

అమెరికా న్యాయవాది లిండ్సే హాలిగన్‌  ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. వాటి ప్రకారం.. 64 ఏళ్ల ఆష్లే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌లో కాంట్రాక్టర్‌గా పని చేశారు.  2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు చేయగా.. ‘సీక్రెట్‌’,  ‘టాప్‌ సీక్రెట్‌’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు లభ్యమయ్యాయి.

ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్‌లు తనకివ్వమని ఆష్లే అడిగినట్లు ఫెడరల్‌ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని పేర్కొన్నారు. అలా 2022లోనూ  2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను ఆష్లే పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.  ఇటీవల కూడా ఇలాంటి భేటీయే జరగ్గా... చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్‌గా బ్యాగు లభించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని ఫెడరల్‌ అధికారులు తెలిపారు.  వీటిల్లో ఆయన దోషి అని తేలితే.. 10 ఏళ్ల వరకూ  జైలు  2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

By
en-us Political News

  
భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.