వైసీపీ నేతల్లో ఓటమి భయం.. మునుగోడు ఫలితం చూసి మన పరిస్థితేంటన్న జంకు

Publish Date:Nov 10, 2022

Advertisement

గత ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్నాం... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో 175కి 175 సీట్లలో మన పార్టీ వారే కూర్చోవాలనే ఆసాధ్య లక్ష్యన్ని ఏర్పరుచుకుని వైసీపీ అధినేత జగన్  అడుగులు వేస్తున్నారని.. ఆ క్రమంలో పార్టీలోని కీలక నేతలను సైతం ఆ దిశగా పరుగులు పెట్టించేస్తున్నారనే ఓ టాక్  పార్టీలో వైరల్ అవుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మన పార్టీని మన పథకాలే గెలిపిస్తాయంటూ.. వివిధ సమీక్షా సమావేశాల్లో సీఎం జగన్.. నేతలకు చెబుతున్నారని  అయితే ఆయనకున్న ధీమా మాత్రం పార్టీ నేతలలో ఇసుమంతైనా కనిపించడం లేదనీ వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. 

అయితే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చూశాక.. వచ్చే ఎన్నికల్లో గెలుపు  జగన్ భావిస్తున్నంత తేలిక ఎంత మాత్రం కాదన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. గెలుపు ధీమా కోల్పోయి ఓ విధమైన అలజడి వైసీపీ  మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న అభ్యర్థుల్లో మొదలైయిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోరైడ్ సమస్యను నిర్మూలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోట్లాది రూపాయిలు వెచ్చించి.. మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందని... దీంతో గత నాలుగైదేళ్లుగా ఆ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని.. అలాగే దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు తదితర పథకాలను కొట్లాది రూపాయిలు అప్పుగా తీసుకొచ్చి మరీ ఆ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఇన్ని పథకాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నా.. మునుగోడులో విజయం కోసం గులాబీ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. అంత కష్టపడ్డా చచ్చీ చెడీ పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది. అది కూడా   వందల కోట్ల రూపాయిలు వ్యయం చేస్తేనే వచ్చింది.  సొమ్ముల పందేరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ విషయంలో టీఆర్ఎస్ తో పోటీ పడలేకపోవడంతోనే టీఆర్ఎస్ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చెప్పుకోవడానికీ, చూపించుకోవడానికీ ఎంతో కొంత చేసిన టీఆర్ఎస్ పరిస్థితే అలా ఉంటే.. ప్రగతి ఊసే పట్టించుకోని వైసీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమౌతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉందన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.   

ఇలాంటి నేపథ్యంలో జగన్ వివిథ పథకాల పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదు వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే గ్యారంటీ అయితే తమకు లేదని వైసీపీ నాయకులే అంతర్గతసంభాషణల్లో ఒకరితో  ఒకరు చెప్పుకుంటున్నపరిస్థితి కనిపిస్తోంది.   ఆ క్రమంలోనే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వివిధ జిల్లాల అధ్యక్షులు.. వరుసగా ఎవరికి వారు.. రాజీనామాల బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చూసుకునే కంటే.. ఆ పదవికీ రాజీనామా చేయడం వల్ల తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి.. వారి చిన్నా చితక సమస్యలు పరిష్కరించడం వల్ల.. మన ఎమ్మెల్యే గారు మనతోనే ఉన్నారంటూ.. ఓ విధమైన కలరింగ్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత వారికి మేలు చేయడమే కాకుండా.. మనకు మేలు జరుగుతోందనే భావనతోపాటు... ఎన్నికల వేళ అప్పటి పరిస్థితిని బట్టి ఓటర్ల నాడిని అంచనా వేసి.. నోట్లు పంచితే అదే తమకు పదివేలు అనుకునే స్థితికి ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిధులంతా వచ్చేశారని.. అలా కాకుంటే... మన పరిస్థితి మునుగుడే అనే ఓ టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోందని సమాచారం. ఏదీ ఏమైనా.. ఓటు వేసే ఓటరు నాడీ.. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నాడి..ఇద్దరిది ఓటుకు నోటుతో పెనవేసుకుపోయి ఉందని.. జగన్ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో ఓ టాక్ అయితే ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ సాక్షిగా గింగరాలు తిరుగుతూ హల్‌చల్ చేస్తోందని చెబుతున్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.