సీఎం జగన్ లో ఓటమి వణుకు?.. అందుకే హిందూపురం టు ఇచ్ఛాపురం టూర్!

Publish Date:Aug 30, 2022

Advertisement

మూడున్నరేళ్లకు ముందు ‘ఒక్క చాన్స్’ అంటూ జనం ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తీరా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీ అధికారం అప్పగించిన అదే జనానికి ముఖం చాటేశారు. అడపా దడపా అదే జనం మధ్యకు రావాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు వారికి ఏమాత్రం అందుబాటు లేకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, పరదాలు వేసుకుని లేదా.. గాల్లోనే చక్కర్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పాలన తర్వాత జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అంటే జగన్ పై వ్యతిరేకత సునామీలా ముంచేస్తుంటే   మరోసారి అదే జనం వద్దకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారని వైసీపీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.   

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నకుంటారంటూ నిర్వహిస్తున్న జనాభిప్రాయం సేకరణలో చంద్రబాబుకు 78.17 శాతం మంది ఓటు వేశారు.  వైఎస్ జగన్ కు అనుకూలంగా కేవలం 18.27 శాతం మందే ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ 3.56 శాతం మంది కోరారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నిర్వహించిన  సర్వేలో కూడా ఇంచుమించు ఇలాంటి ఏకపక్ష ఫలితమే కనిపించడం విశేషం.

రఘురామ సర్వేలో 93 స్థానాల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తున్నట్లు తేలడం విశేషం. పోటా పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కూడా 50 శాతం టీడీపీకే అనుకూల ఫలితాలు ఉన్నాయన్నది ఆయన సర్వే సారాంశం. ఏ సర్వే చూసినా   చంద్రబాబే విజయయాత్ర చేస్తారని తేలుతోంది. అంతెందుకు జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా ఇంచుమించు ఇదే ఫలితం రావడంతో ఆయన నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తానంటూ ఒక జాబితా కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న నియోజకవర్గాలన్నిటిలోనూ వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలో తేలిందని పరిశీలకులు అంటున్నారు. 
దీంతో జగన్ లో ఓటమి వణుకు మొదలైందంటున్నారు. ఈ క్రమంలో జగన్ హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఏపీలో వైసీపీ పట్ల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైందంటున్నారు. గతంలో జనం మధ్యలో ఉన్న తనను ఓటర్లు మెచ్చి ఓట్లు వేశారని, అందుకే 151 స్థానాలు ఇచ్చి తనకు తిరుగులేని మెజారిటీ అందించారని జగన్ గొప్పగా చెబుతుంటారు. అనేక వ్యతిరేకతలు, వైఫల్యాల కారణంగా ఈసారి వైసీపీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయన నమ్ముతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీకి కావాల్సిన సీట్లు సాధించాలనే వ్యూహంతో జగన్ మరోసారి జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

ఒక పక్కన రోజు రోజుకూ తగ్గిపోతున్న వైసీపీ హవా.. మరో పక్కన ఏ క్షణంలో అయినా   జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసే సూచనలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు జగన్ జనం మధ్యనే ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ గనుక రద్దయితే ఇప్పుడు కూడా జనం మధ్యే ఉండి మరోసారి తనకు ఇబ్బందులు తెలెత్తకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర యాత్రకు ఉపక్రమిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజవర్గాల వారీగా పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటున్న జగన్ కు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం పట్టు దొరకడం లేదట. 23 చోట్ల టీడీపీ గెలిచిన  సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో  వైసీపీకి ఇప్పటికీ కాలు మోపే సందు దొరకని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

టీడీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా తన ఉనికి చాటుకోవాలని జగన్ యత్నిస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగించారు. అయినప్పటికీ   జగన్ ఆటలు సాగలేదంటున్నారు. అందుకే మూడున్నరేళ్లుగా జనానికి ముఖం చాటేసిన జగన్ మళ్లీ జనం మధ్యకు రావాలని నిర్ణయించారని అంటున్నారు.

ముక్తాయింపు ఏమింటంటే.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో జగన్ లో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే.. ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించడమే కాకుండా, అరెస్టులు చేయించారు. అంతటితో ఆగకుండా తాను నివాసం ఉంటున్న  తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం. కేవలం రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల అల్టిమేటానికే ఇంతలా భయపడుతున్న జగన్ రేపు ఐదున్నర కోట్ల మంది జనానికి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏం చేశానని చెప్పుకుంటారు? మళ్లీ తనకు ఓటు వేసి గెలిపించాలనే ఎలా అభ్యర్థిస్తారన్నది చూడాల్సిందేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.