జగన్ లో ముదిరిపోయిన ఓటమి భయం

Publish Date:Nov 1, 2023

Advertisement

తప్పు ఒప్పు లేదు.. చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతకైనా సిద్దపడుతున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ ఈసారి ప్రతిపక్షాలను తనకు అడ్డం లేకుండా చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు. కనీసం ఛార్జ్ షీట్ లో పేరు కూడా  లేని కేసులో చంద్రబాబును ఇరికించి.. అప్పటికప్పుడు కఠినమైన సెక్షన్లతో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ను రాజమండ్రి జైలుకు పరిమితం చేశారు. 53 రోజులుగా ఈ కేసు దర్యాప్తు ఎలాంటి కొలిక్కి రాలేదు. అయితే, చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా సీఐడీ చంద్రబాబును కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. ఆయనను బయటకి పంపినా ఆయన చేతులు కట్టేసేలా చర్యలు ఉండాలని సీఐడీ కోరింది.

చంద్రబాబు విడుదలతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.  రాజమండ్రి నుండి విజయవాడ వరకూ దారిపొడవునా జనం బాబుకు జయజయధ్వనాలు చేశారు. చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ అధినేత జైలు నుండి బయటకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులలో కదలిక వచ్చిది. తెలుగుదేశం నేతలు మునుపెన్నడూ లేని విధంగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఇక, ప్రభుత్వంపై సమరశంఖమే అనే భావన కలుగుతుండగానే ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. టీడీపీలో ఉత్సాహం ఏ మాత్రం గిట్టని వైసీపీ సర్కార్ మాత్రం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని.. అందుకే చంద్రబాబును కట్టడి చేసేలా చర్యలు ఉండాలని కోరారు.

చంద్రబాబు అరెస్టుకు ముందు వైసీపీ పరిస్థితి నిర్జీవంగా కనిపించింది. అప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర, ప్రాజెక్టుల సందర్శనతో టీడీపీ ఫుల్ స్వింగ్ లో ఉండగా.. పవన్ కళ్యాణ్ కూడా వారాహీ యాత్రతో జనసేనను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ముందస్తు సర్వేలలో కూడా వైసీపీ పరాజయం ఖరారనే ఫలితాలతో ఎక్కడికక్కడ వైసీపీ పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఎలాగైనా చంద్రబాబును కట్టడి చేయాలనే కుట్ర పన్ని స్కిల్ కేసులో ఆయనను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ కేసును న్యాయస్థానాలలో నిలిపేందుకు కూడా   శ్రమ  పడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో సీఐడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోతుంది. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ బయటకి వస్తారోనని రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, పుంగనూరు కేసులను కూడా పైకి తెచ్చిన సీఐడీ ఎలాగైనా ఆయన్ను బయటకు రాకుండా చూడాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ, ఫైనల్ గా చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చారు .

అయితే, చంద్రబాబు బయట ఉన్నా బెయిల్ షరతుల పేరిట ఆయన్ను కట్టడి చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తే.. ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్ధమవుతుంది. స్కిల్ కేసులో ఈసారి కోర్టు తప్పకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందని భావించిన సీఐడీ.. అప్పటికప్పుడు మద్యం కేసును తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు అక్రమంగా లిక్కర్ లైసెన్సులు ఇచ్చారంటూ ఆయన్ను ఏ3గా చూపుతూ కోర్టుకు నివేదించింది. అయితే కోర్టు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ వైపే మొగ్గు చూపింది. బెయిల్ ఇచ్చినా షరతులు కఠినంగా ఉండాలని మరో పిటిషన్ కూడా వేసింది. ఇదంతా చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం ఎంతగా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.